Radio LIVE


Breaking News

Monday, 1 September 2014

సీరీస్ పై కన్నేసిన భారత్-నేడు ఇంగ్లాండ్ తో నాలుగో వన్డే

భారత్,ఇంగ్లాండ్ ల మధ్య నాలుగోవన్డే బర్మింగ్హామ్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ లో గెలిచి సీరీస్ చేజిక్కించుకోవాలని భారత్ భావిస్తుంది.ఎలాగు సీరీస్ ఓడిపోయే అవకాశం లేదు కాబట్టి ఒత్తిడి లేకుండా భారత్ బరిలోకి దిగనుంది.అందుకుతోడు వన్డే రేటింగ్స్ లో భారత్ మొదటి ర్యాంక్ దక్కించుకోవడం కూడా ధోని సేనకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఇంగ్లాండ్ కు సీరీస్ దక్కించుకునే అవకాశం లేనప్పటికీ సీరీస్ సమం చేయాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిందే.అయితే జోరుమీద ఉన్న భారత్ జట్టును నిలవరించడం ఇంగ్లాండ్ జట్టుకు కష్టమనే చెప్పాలి.
మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా తరువాతి రెండు వన్డేలలో భారత్ సునాయాసంగా విజయం సాధించి 2-0 ఆధిక్యంలో ఉంది.రోహిత్ శర్మ స్థానంలో వచ్చిన మురళి విజయ్ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం ఉండకపోవచ్చు.ఎలాంటి మార్పులు లేకుండానే 3వ వన్డే ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
వాతావరణం పొడిగా ఉండొచ్చు,పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండవచ్చు.ఈ వేదిక మీద భారత్ 7వన్డేలు ఆడగా నాలుగింటిలో గెలిచింది.మరో విజయం భారత్ కు అందిస్తే ధోని అత్యధిక వన్డేల్లో భారత్ ను గెలిపించిన కెప్టెన్ గా రికార్డు సాధించనున్నాడు.ప్రస్తుతానికి అజహరుద్దీన్ తో సమంగా 90 వన్డేల్లో భారత్ ను గెలిపించాడు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates