వన్డేల్లో తమకు ఎదురులేదని భారత్ జట్టు మరోసారి ఋజువు చేసుకుంది.ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ధోనీ సేన టెస్ట్ సీరీస్ కోల్పోయి అనేక విమర్శలు ఎదుర్కొని చివరకు ధోని కెప్టెన్ గా తప్పుకుంటున్నాడు అనే వరకు వెళ్ళింది.కాని అందుకు భిన్నంగా వన్డే సీరీస్ లో దుమ్మురేపుతుంది భారత్ జట్టు.వరుస విజయాలతో ఇంగ్లాండ్ ను మట్టి కరిపిస్తూ ఇంకా ఒక వన్డే మిగిలి ఉండగానే సీరీస్ ను కైవసం చేసుకుంది.ఓపెనర్ రహనే ఆద్భుతమైన సెంచరీకి తోడు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 97 పరుగులు చేయడంతో ఇంకా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే జయభేరి మోగించింది.
207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఓపెనర్లు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.మొదటి వికెట్ కు రహనే,ధావన్ కలిసి 183 పరుగులు జోడించారు.ఇంగ్లాండ్ పై ఇంగ్లాండ్ లో భారత్ కు ఇదే అత్యుత్తమ మొదటి వికెట్ భాగస్వామ్యం.దూకుడుగా ఆడుతూ మొదట సెంచరీ చేసిన రహనే 106 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.తరువాత వచ్చిన కోహ్లి(1)తో కలిసి శిఖర్ ధావన్(97) భారత్ ను విజయ తీరాలకు అందించాడు.సిక్స్ తో భారత్ కు విజయాన్ని అందించిన ధావన్ సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.కెరీర్ లో మొదటి సెంచరీ చేసిన రహనేకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకు ముందు టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆదిలోనే తడబడింది.భువనేశ్వర్ కుమార్ స్వింగ్ బౌలింగ్ ను ఎదుర్కొనలేక 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.మూడో వికెట్ ను షమీ 23 పరుగుల వద్ద కూల్చాడు.రూట్(44),మోర్గాన్(32)లు కలిసి నాలుగో వికెట్ కు 80 పరుగులు జోడించారు.కాని చాలా నెమ్మదిగా స్కోర్ బోర్డును కదిలించారు.వీరు వెంటవెంటనే ఔట్ అవడం తరువాత వచ్చిన వారు క్రీజ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు.మూయిన్ ఆలి ఒక్కడే 67 పరుగులతో రాణించాడు.షమీ 3 వికెట్లు,భువి,జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
చివరి వన్డే శుక్రవారం లీడ్స్ వేదికగా జరగనుంది.
No comments:
Post a Comment