Radio LIVE


Breaking News

Friday, 12 September 2014

రవితేజ సినిమా 'పవర్' రివ్యూ..!

'బలుపు' సినిమా విజయం తరువాత సంవత్సరం పైగా గ్యాప్ తరువాత మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం 'పవర్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గతంలో డాన్ శీను,మిస్టర్ ఫర్‌ఫెక్ట్,బలుపు చిత్రాల ద్వారా కథారచయితగా మంచి పేరు తెచ్చుకున్న బాబీ(కే ఎస్ రవీంద్ర) ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.రాక్ లైన్ ఎంటర్ టైనమెంట్ నిర్మాణసారథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా హన్సిక,రెజీనా కథానాయికలుగా నటించారు.
'పవర్' మీద భారీ ఆశలు పెట్టుకున్న రవితేజ,సినిమాలో పవర్ చూపించాడా? అసలు సినిమాలో పవర్ ఉందా...? లేదా..? చూద్దాం
కోల్ కతాలో అవినీతి పోలీస్ ఆఫీసర్ ఏసీపీ బలదేవ్ సహాయ్(రవితేజ).హోంమంత్రి జయవర్ధనే(ముఖేశ్ రుషి)సోదరుడు గంగూలీ భాయ్(సంపత్)ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్తుండగా బలదేవ్ సహాయ్ అతన్ని కోర్టులో ప్రవేశపెట్టకుండా పోలీసుల నుండి తప్పించి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాడు.ఇక్కడ కట్ చేస్తే.....
హైదరాబాద్ లో పోలీస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో తిరుపతి(రవితేజ) అనే కుర్రాడు చేయని ప్రయత్నాలు లేవు,కాని అన్నీ విఫలం అవుతాయి.అనుకోకుండా హోంమంత్రి జయవర్ధనే తిరుపతిని చూసి అతనితో మాట్లాడి ఏసీపీ బలదేవ్ సహాయ్ స్థానంలో కూర్చోబెడతాడు.కాని తిరుపతి అలియాస్ బలదేవ్ సహాయ్ జయవర్ధనేకు ఎదురు తిరుగుతాడు.అసలు తిరుపతి ఎందుకు ఎదురుతిరుగుతాడు?బలదేవ్ సహాయ్ నిజంగా అవినీతి ఆఫీసరా?అసలు గంగూ భాయ్ ఎవరు?ఇద్దరు హీరోయిన్లు తిరుపతికి ఎలా సహాయపడతారు వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్లు
రవితేజ ఎనర్జీ సినిమాకు అదనపు బలం.తిరుపతి,బలదేవ్ సహాయ్ రెండు పాత్రల్లో రవితేజ కనిపించారు.హాస్యాన్ని అందించడంలో రవితేజ మరోసారి తనమార్కు ఏంటో చూపించాడు.హాస్యంతో పాటు యాక్షన్ సన్నివేశాలు బాగా చేశాడు హీరో.సినిమాలో హీరోయిన్ల పాత్రలకు అంతగా ప్రాధాన్యం లేనప్పటికీ ఇద్దరూ బాగానే నటించారు.ఫ్లాష్ బ్యాక్ లో కనిపించిన రెజీనా గ్లామర్ గా కనిపించింది.ఒక సాంగ్ లో లిప్ కిస్ తోపాటు గ్లామర్ డోస్ పెంచింది రెజీనా.హన్సిక 4 పాటలకు పరిమితమైంది అని చెప్పవచ్చు.ఆణిముత్యం పాత్రలో బ్రహ్మానందం సందడి చేశాడు.కనిపించినంత సేపు నవ్వించాడు.సప్తగిరి కనిపించింది కొంతసేపే అయిన పాత్రకు న్యాయం చేసి నవ్వులు పండించాడు.జయనన్ విన్సెంట్‌తో కలిసి ఆర్థర్ విల్సన్ ఫోటో గ్రఫీ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం బాగుంటుంది.
మైనస్ పాయింట్లు
దర్శకుడిగా మారిన బాబి సాహసం చేయకుండా రోటీన్ గానే సినిమా తీశాడు.ఒకవిధంగా కథను నడిపించడంలో కన్ఫ్యూజ్ అయ్యాడు.అనుకున్నట్టు కథను ప్రెసెంట్ చేయలేకపోయాడు.స్టొరీ లైన్ విషయానికి వస్తే 'ఆపరేషన్ దుర్యోధన' సినిమా గుర్తుకొస్తుంది.టేకింగ్ పరంగా చూస్తే 'విక్రమార్కుడు',చిత్రంలో సన్నివేశాలు కొన్ని 'బలుపు' చిత్రాన్ని పోలి ఉంటాయి.క్లైమాక్స్ లుంగీ డాన్స్ సీక్వెన్స్ అంతగా ఆకట్టుకోదు.తమన్ సంగీతం యావరేజ్ అని చెప్పొచ్చు.సెకండ్ ఆఫ్ లో కామెడీ కనిపించదు.
తీర్పు
చాలా రోజుల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ 'పవర్' అంత పవర్ చూపించలేదు.రొటీన్ చిత్రమే అయినప్పటికే ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.అందులో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.మూస దొరణిని పక్కకు పెడితే ఇంకొంచం కొత్తగా కనిపించేది దర్శకుడి ప్రతిభ.రవితేజ అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తారు.కాని మిగతావారు సెకండ్ ఆఫ్ కు వచ్చే సరికి కొంత ఇబ్బంది పడొచ్చు.ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సినిమాలు లేకపోవడం పవర్ కు ప్లస్.మొదటి వారం కలెక్షన్లు రాబట్టడంలో సఫలం అవుతుంది సినిమా.
రేడియో జల్సా.కామ్ రేటింగ్ :: 3.25/5

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates