నేరం చేసింది తన కొడుకైన సరే శిక్ష అనుభవించాల్సిందే అని భావించిన ఒక మాతృ మూర్తి తన కొడుకును కటకటాల వెనకకు పంపించడానికి సైతం వెనుకాడలేదు.మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన కొడుకును అరెస్ట్ చేయించింది ఆ ఆదర్శ మూర్తి.వివరాలు పరిశీలిస్తే :
పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాలు జిల్లా కాన్నింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.నజీర్ షేక్ అనే బస్సు కండక్టర్ ఇంకా అతని ముగ్గురు మిత్రులు కలిసి మైనర్ బాలిక(వయసు ప్రస్తావించడం లేదు) మీద అత్యాచారం చేశారు.స్కూల్లో టాయిలెట్లు మూసివేయడంతో బయటికి వచ్చిన ఆ బాలికను పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు.ఇంటికి వెళ్ళిన వాడు తాగిన మైకంలో విషయాన్నీ తల్లి అనిర్ బీబీ కి చెప్పాడు.వెంటనే ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళిన తల్లి అపస్మారక స్థితిలో అక్కడే పడి ఉన్న ఆ బాలికను డైమండ్ హార్బర్ హాస్పిటల్ కు తీసుకెళ్ళి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.పోలీసులు వచ్చి నజీర్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు.
అనిర్ బీబీ బాలికను ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం అందించే వరకు ఘటన గురించి బాలిక తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం చేరలేదు అని సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ రుపాంతర్ సేన్ గుప్తా చెప్పారు.
No comments:
Post a Comment