ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా అనే సందేహాలకు సీఎం చంద్రబాబునాయుడు నాయడు ఈరోజు అసెంబ్లీలో తెరదించాడు.ఏపీ రాజధాని విజయవాడ పరిసరాల్లోనే ఉంటుందని చంద్రబాబు అసెంబ్లీ లో ప్రకటన చేశారు.విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఉండాలని సెప్టెంబర్ 1 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భూసేకరణ విదివిధానాల మీద మంత్రివర్గ ఉపసంఘం వేసినట్టు చెప్పారు.కొత్తగా మూడు మెగా సిటీలను,14 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని అన్నారు సీఎం.అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని,అభివృద్దిని ఆంధ్రప్రదేశ్ అంతటా వికేంద్రీకరిస్తామని,అభివృద్దికి ప్రతిపక్షం సహకరించడం లేదని,ప్రతిపక్షం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.
ప్రతిపక్షాల నిరసన,ఆందోళన మధ్యనే చంద్రబాబునాయుడు రాజధాని ప్రకటన చేశారు.రాజధాని మీద ప్రకటన పూర్తయింది,ఇక మీకు ఎంకావాలో చర్చ చేసుకోవచ్చు అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.
No comments:
Post a Comment