TV లో క్రైమ్ వార్తలు చదివే యాంకరే క్రైమ్ చేస్తే..
ఒక TV ఛానల్ లో క్రైమ్ వాచ్ పేరిట వచ్చే ప్రోగ్రాంకు యాంకర్ గా పనిచేసే హర్షవర్ధన్ ను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు.పోలిసుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో ఉన్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్సాండెంట్ ఫాదర్ పి.బాలను హర్షవర్ధన్ బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు.ఒకవేళ డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకుంటే ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో కళాశాలకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తానని బెదిరించాడని పోలీసులు చెప్పారు.
డెంటల్ కళాశాల కరస్సాండెంట్ ఫాదర్ పి.బాల ఎస్ పి రఘురామి రెడ్డిని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు మేరకు పోలీసులు మొదట హర్షవర్దన్ కు సహకరించిన నల్లజర్లకు చెందిన ఫాదర్ ల్యూక్‌బాబును మొదట అరెస్ట్ చేశారు.ల్యుక్ బాబు అందించిన సమాచారం ప్రకారం హర్షవర్ధన్ విజయవాడలో ఉన్నాడని తెలుసుకొని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
భీమడోలు మండలం తండ్రగుంటకు చెందిన యండ్రపాటి హర్షవర్ధన్ ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డాడు.కొన్ని చిత్రాల్లో కూడా నటించాడు.
No comments:
Post a Comment