Radio LIVE


Breaking News

Monday, 1 September 2014

కారెక్కిన ఇద్దరు ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎమ్మెల్సీలు

టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి.సోమవారం ఇద్దరు ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.ఖమ్మం జిల్లా వైరా వైకాపా ఎమ్మెల్యే మదన్ లాల్,కాంగ్రెస్ కు చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య,కాంగ్రేస్ ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి,వెంకట్రావు,రాజేశ్వర్ రావు లను తెరాస అధినేత కెసిఆర్ సమక్షంలో కేకే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.
తెలంగాణా భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో బంగారు తెలంగాణా కోసం కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు.ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుంది అని ఖమ్మం జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుంది,హైదరాబాద్ లో వేలమంది తెరాసాలో చేరేందుకు వస్తున్నారు అని నాయిని అన్నారు.
త్వరలో టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు తెరాసాలో చేరనున్నారు.తలసాని కూడా త్వరలో టీఆర్ఎస్ లో చేరుతారు అని వార్తలు వస్తున్నాయి.ఈరోజు కెసిఆర్ తో గంటపాటు సమావేశమైన తలసాని ఈ విషయమై స్పందించలేదు.మరికొంత మంది టీడీపీ నాయకులూ త్వరలో పార్టీలో చేరనున్నారు అని తెరాస శ్రేణులు చెపుతున్నాయి.



No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates