ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీ లో బీజేపీ ఎమ్మెల్యే జితేందర్ సింగ్ షంటి మీద గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపి పారిపోయాడు.ఈ ఘటనలో ఏలాంటి గాయాలు కాకుండా జితేందర్ సింగ్ షంటి తప్పించుకున్నాడు.దీనికి సంభందించిన వీడియో ఫూటేజ్ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది.
తూర్పు ఢిల్లీ శహ్దార బీజేపీ ఎమ్మెల్యే జితేందర్ సింగ్ షంటి ఇంటికి ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు వచ్చారు.ఒకరు బైక్ మీద ఉండగా,మరొకరు హెల్మెట్ ధరించి షంటి వద్దకు వచ్చాడు.కొన్ని పత్రాల దృవీకరణ కోసం వచ్చినట్టు,వాటిని పరిశీలిస్తున్న సమయంలో దుండగుడు దాడికి యత్నించగా అందుకు ప్రతిగటించారు ఎమ్మెల్ల్యే,అంతలోనే తనతో పాటు తెచ్చుకున్న తుఫాకితో కాల్చే ప్రయతం చేశాడు ఆ వ్యక్తి,బుల్లెట్ గాయాలు కాకుండా తప్పించుకున్నాడు ఎమ్మెల్ల్యే.తరువాత ఈ ఘటనకు సంభందించి పోలీసులకు సమాచారం అందించాడు.సిసి ఫూటేజ్ ఆధారంగా దుండగుడు ఎవరు అనే దానిమీద పోలీసులు విచారిస్తున్నారు
Watch Video Here
Watch Video Here
No comments:
Post a Comment