Radio LIVE


Breaking News

Friday, 5 September 2014

జీహేచ్ఎంసీ టార్గెట్ ఈ ఏడాది రూ.100 కోట్లు


మహానగర పాలక సంస్థ (GHMC)ఈ ఏడాది ట్రేడ్ లైసెన్సు ఫీజుల ద్వారా 100కోట్లు రాబట్టాలని లక్ష్యం పెట్టుకుంది.దీనిలో భాగంగా నగరంలో ఒక్క దుకాణాన్ని కూడా వదలకుండా అన్నింటికీ లైసెన్సులను జారి చేసి ఫీజులు వసూలు చేయాలని అంతేకాక ఈసారి గతానికి భిన్నంగా రోడ్డు వెడల్పు ఆధారంగా ఫీజులు వసూలు చేయాలనీ నిర్ణయించింది.
గతంలో ట్రేడ్ లైసెన్సుల కోసం ప్రాంతాల వారిగా,దుకాణం ఆధారంగా(స్లాబు ,పెంకులు,రేకులు ఫర్నిష్డ్,నాన్ ఫర్నిష్డ్,ఏసీ,నాన్ ఏసీ)ఫిక్స్ డ్ ధరలు ఉండేవి.
ఉదాహరణకు ఒక ఆసుపత్రి ఉంటె గరిష్టంగా దానికి రూ.35వేలు అదే ఓ చిన్న దుకాణం అయితే రూ.5వేలు ఉండేది.ఈ ధరలు నిర్ణయించే అధికారం అధికారుల చేతుల్లో ఉండడం వల్ల బారీగా అవినీతి జరిగి లెక్కలు తారుమారు అయ్యేవి.తక్కువ ఫీజు వసూలు చేయడానికి పెద్ద దుకాణాలను కూడా చిన్న వాటిలో లేక్కేయడం వల్ల బల్ధియా ఆదాయానికి గండీపడుతూ ఉండేది.దీన్ని మార్చుతూ ఈసారి నగరమంతా ప్రతి చదరపు అడుగుకు రూ.3 నుంచి గరిష్టంగా రూ.6 నిర్ధరించగా దీనిపై పాతబస్తీతో పాటు గిరాకి అంతగా ఉండని ప్రాంతాలనుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది.దీంతో బల్ధియా స్థాయీసంఘం అధికారుల ప్రతిపాదనను తిరస్కరించి కొత్త విధానాన్ని ప్రతిపాదించాలని సూచించింది.
ఫలితంగా సింగిల్ లేన్,డబుల్ లేన్,మల్టిపుల్ లేన్స్ గా విభజింఛి ఒక్కోదానికి ఒక్కోవిధంగా ధరలు నిర్ణయించారు.
సింగిల్ లేన్ లో ఉండే మామూలు చిన్న తరహ దుకాణాలకు ప్రతి చదరపు అడుగుకు రూ.3వేలు,గరిష్టంగా రూ.5వేలు.
డబుల్ లేన్ లో ఉండే దుకాణాలకు రూ.4వేలు,గరిష్టంగా 35వేలు.
రెండు లేన్ ల కన్నా ఎక్కువ వెడల్పు ఉండే రోడ్లకు ప్రతి చదరపు అడుగుకు రూ.6 ,గరిష్టంగా లక్ష.
కార్పోరేట్ ఆసుపత్రులు,బ్రాండెడ్ సంస్థలు,త్రీ,ఫైవ్ స్టార్ హోటళ్లకు గరిష్టంగా రూ.2లక్షలకు నిర్ధారించారు. వీటికి స్థాయి సంఘం ఆమోదం తెలపడం వల్ల కొత్తధరల ప్రకారమే అధికారులు లైసెన్సు ఫీజులు వసూలు చేయనున్నారు.
గత ఏడాది GHMC అధికారులు ప్రతి దుకాణాన్ని లైసెన్సు పరిధిలోకి తేవాలనే ఉద్దేశ్యంతో సమగ్రసర్వే చేపట్టారు.ఎన్నికలు ఇతరత్రా పనుల వల్ల మధ్యలో సర్వేకు ఆటంకం తలెత్తగా తాజాగా మళ్లి సర్వే ప్రారంభించారు.ఇప్పటివరకు 65వేల కొత్త దుకాణాలకు లైసెన్సులు లేనట్లు గుర్తించారు.కాగా ఇప్పటివరకు 40వేల లైసెన్సులు ఉండగా,కొత్తవాటితో కలిపి వీటి సంఖ్య చేరనుంది.మరో లక్ష వరకు లైసెన్సులు లేకుండా దుకాణాలు,ఇతర సంస్థలు కొనసాగుతున్నట్లు అధికారుల అంచనా.దీంతో ఈ ఏడాది చివరికల్లా అన్ని దుకాణాల నుంచి మొత్తమ్మీద రూ.100కోట్ల లైసెన్సు ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించారు.
లైసెన్సుల విధానంలో అక్రమాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని సులభతరం చేశారు.దీనిలో భాగంగా ఎవరైనా తమ దుకాణాల ముందున్న రోడ్డు ఆధారంగా ప్రతి చదరపు అడుగుకు నిర్ధారిత ఫీజు ప్రకారం మొత్తం ఎంత ఫీజు అవుతుందో లెక్కించుకోవచ్చు.సొంతంగా తమ దుకాణానికి ఎంత ఫీజు అవుతుందో లేక్కించుకొని ఆ మొత్తాన్ని సమీపంలోని మీ-సేవా కేంద్రం లేదా GHMC పౌర సేవ కేంద్రంలో చెల్లిస్తే తాత్కాలిక లైసెన్సును వెంటనే జారీ చేస్తారు.తర్వాత టాక్స్ సిబ్బంది దుకాణాన్ని పరిశీలించి సరిగానే వారు ఫీజు చెల్లించినట్లు గుర్తిస్తే పర్మినెంట్ లైసెన్స్ జారీ చేస్తారు.ఈ విషయమై GHMC కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ దళారులకు ఆస్కారం లేనందువల్ల లైసెన్సులు పొందేందుకు దుకాణం దారులంతా ముందుకొస్తారని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates