Radio LIVE


Breaking News

Thursday, 11 September 2014

ఆంజనేయ స్వామికి ఆధార్ కార్డుంది,మరి మీకు...?

మనుషులకే కాదు దేవుళ్ళకూ ఆధార్ కార్డులు వస్తున్నాయి.అవును మీరు చదివింది నిజమే.రాజస్థాన్ లో ఆంజనేయ స్వామికి ఆధార్ కార్డు జారీ చేశారు.స్వయంగా హనుమంతుడే వచ్చి ఫోటోతో పాటు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారా!ఆధార్ కేంద్రంలోకి వెళ్లి నమోదు చేసుకుంటే తప్ప రాని 12 సంఖ్యల ఆధార్ కార్డు దేవుడి పేరుమీద ఎలా వచ్చింది.ఆధార్ కార్డు జారీ ప్రక్రియకూడా పారదర్శకంగా జరగడం లేదా అనే అనుమానం కలుగుతుంది.దేశంలో ప్రతీ ఒక్కరికి ఒక ప్రత్యేక సంఖ్య ఉండాలని,ప్రభుత్వ పథకాల్లో ఆధార్ కార్డును ప్రామాణికంగా ఉపయోగించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.
కార్డు మీద ఉన్న వివరాల ప్రకారం 'హనుమాన్ జి' అనే పేరు మీద కార్డు జారీ అయింది.తండ్రి పేరు 'పవన్ జి',పుట్టిన రోజు 01/01/1959,పురుష లింగం.
వివరాలు పరిశీలిస్తే రాజస్థాన్ లోని సీకర్ జిల్లా పోస్టాఫీసుకు నాలుగు రోజుల క్రితం ఈ ఆధార్ కార్డు వచ్చింది.కార్డు మీద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా తప్పుడు నకిలీ కార్డు అని అధికారులు గుర్తించారు.
విక్కీ కుమార్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ఆధార్ కార్డు కోసం 4 సార్లు దరఖాస్తు చేసుకున్నాడట,కాని అతని ఫింగర్ ప్రింట్స్ కంప్యూటర్ ఆమోదించలేదు,కాబట్టి హనుమంతుడి పేరు మీద దరఖాస్తు చేసి తన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాడట...ఈసారి మాత్రం ఆధార్ కార్డు వచ్చింది.కాని కార్డు తీసుకోవడానికి సదరు దరఖాస్తుదారుడు నిరాకరిస్తున్నాడు.
అడ్రస్ గుర్తించడానికే నాలుగురోజులు పట్టిందని,కార్డు తీసుకోవడానికి అతను నిరాకరిస్తున్నాడు,కాబట్టి కార్డును తిరిగి వెనకకు పంపిస్తున్నాము అని పోస్టల్ అధికారి భోగ్ రాజ్ చెప్పారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates