తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం తెరాస పార్టీ అధ్యక్షుడు సీఎం కెసిఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఆగష్టు 30న టీడీపీకి రాజీనామా చేసిన తుమ్మల ఈరోజు ఉదయం మూడువేల వాహనాలతో బారీ ర్యాలీగా ఖమ్మం నుండి బయలుదేరి తెలంగాణా భవన్ కు చేరుకొని తెరాసాలో చేరారు.
తుమ్మలతో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ,కొండబాల కోటేశ్వర్ రావు,ఖమ్మం జడ్పీ చైర్ పర్సన్ కవిత,డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు,కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్ రావు లు కూడా టీఆర్ఎస్ లో చేరారు.ఇంకా 18మంది జడ్పీటీసీలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు వేలాది మంది కార్యకర్తలు తుమ్మలతో పాటు తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ తుమ్మల నిఖార్సయిన నేత అని,టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో మేము కూడా ఉన్నామని,మొదటిసారి పోటీ చేసినప్పుడు ఇద్దరం ఓడిపోయామని చెప్పుకొచ్చారు.తుమ్మలను కెసిఆర్ తన మాటలతో ఆకాశానికి ఎత్తారు.తుమ్మల తనకు ఆప్త మిత్రుడని,పార్టీలో చేరడానికి వెయ్యిమంది వస్తారని ఊహించాను అని,ఇంత పెద్ద మొత్తంలో వస్తారని తెలిస్తే సభ నిజాం గ్రౌండ్స్ లో పెట్టుకునేవాళ్ళమని,ఇది తుమ్మల పొరపాటు అందులో నా తప్పు లేదని చమత్కరించారు సీఎం కెసిఆర్.
No comments:
Post a Comment