తన సోదరి మీద అత్యాచారం చేశారని ఒకతను తన మిత్రులతో కలిసి అత్యాచారం చేసిన వాడి సోదరిని రేప్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే ఆగష్టు 25న కొందరు దుర్మార్గులు ఒక యువతిని అత్యాచారం చేశారు.అవమానభారంతో ఆ యువతీ కుమ్హేదా బ్రిడ్జి దగ్గర ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా అక్కడి ప్రజలు కాపాడి వివరాలు తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
అయితే ఇది మనసులో పెట్టుకున్న భాదితురాలి సోదరుడు మరో నలుగురితో కలిసి రాత్రి నేరం చేసిన వాడి ఇంటికి వెళ్ళారు.నిందితుడి తల్లి మరియు సోదరి ఇంట్లో నిద్రిస్తున్నారు,ఇంట్లోకి వెళ్ళిన ఇదుగురు అతని 16 సంవత్సరాల సోదరిని కిడ్నాప్ చేసి ఊరికి దూరంగా తీసుకెళ్ళి అత్యాచారం చేశారు.సోమవారం ఊరు చివర్లో పడి ఉన్న ఆ యువతిని కనుగొన్నారు.కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు ఊరు ప్రజలు.అయితే ఘటన అనుమానాలకు తావిచ్చేల ఉందని కేసు తీసుకోవడానికి నిరాకరించారు పోలీసులు.దాంతో గ్రామ ప్రజలు పెద్దఎత్తున నిరసన తెలపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
No comments:
Post a Comment