Radio LIVE


Breaking News
Showing posts with label Andhra Pradesh News. Show all posts
Showing posts with label Andhra Pradesh News. Show all posts

Sunday, 7 June 2015

చంద్రబాబు,స్టీఫెన్ సన్ ల మధ్య ఫోన్ సంభాషణ ఇలా సాగింది...!



ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ కు 50 లక్షలు ఇస్తూ ఏసీబీ కి చిక్కిన రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఆ పార్టీ నేతలు ఇన్ని రోజులు దమ్ముంటే చంద్రబాబు,స్టీఫెన్ సన్ తో మాట్లాడిన టేప్ లు బయట పెట్టాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆ టేప్ బయటికి వచ్చింది.
టేప్ లో ఉన్న దాని ప్రకారం చంద్రబాబు మరియు స్టీఫెన్ సన్ ల మధ్య ఫోన్ సంభాషణ ఇలా సాగింది.
ట్రింగ్....... ట్రింగ్ ......
స్టీఫెన్ సన్ : హలో ...
చంద్రబాబు మనిషి : యా ..  బ్రదర్, బాబు గారు వాంట్స్ టు టాక్ టూ యు, బీ ఆన్ ద లైన్ 
చంద్రబాబు : హలో 
స్టీఫెన్ సన్ : సర్,గుడ్ ఈవినింగ్ సర్.
చంద్రబాబు : ఆ..గుడ్ ఈవెనింగ్ బ్రదర్.హౌ ఆర్ యు 
స్టీఫెన్ సన్ : ఫైన్ థాంక్స్ సర్.
చంద్రబాబు : మనవాళ్ళు,బ్రీఫ్డ్ మీ,ఐయామ్ విత్ మి,డోంట్ బాదర్.
స్టీఫెన్ సన్ : రైట్ సర్..
చంద్రబాబు : ఫర్ ఎవ్రీ థింగ్ .. వాట్ ఆల్ దే స్పోక్..విల్ హానర్
స్టీఫెన్ సన్ : ఎస్ సర్..రైట్ సర్ ..
చంద్రబాబు : ఫ్రీలీ యు కెన్ డిసైడ్..no ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ...
స్టీఫెన్ సన్ : ఓకే సర్..
చంద్రబాబు : దట్ ఈస్ అవర్ కమిట్ మెంట్ .. వి విల్ వర్క్ టుగెదర్...
స్టీఫెన్ సన్ : రైట్ .. థాంక్యు..
చంద్రబాబు : థాంక్యు ......

Read more ...

Sunday, 24 May 2015

వ్యాయామం చేస్తూ గాయపడిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి

చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఇంట్లో వ్యాయామం చేస్తూ గాయపడింది.భువనేశ్వరి ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తూ కిందపడి పోవడంతో చేతి మణికట్టు విరిగింది.
గాయపడిన భువనేశ్వరిని వెంటనే జుబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు తరలించారు.
భువనేశ్వరిని పరీక్షించిన వైద్యులు మధ్యాహ్నం శస్త్రచికిత్స చేయనున్నారు.భార్యను చూసేందుకు చంద్రబాబు నాయుడు వెంటనే అపోలో ఆసుపత్రికి వెళ్ళారు.బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు.హరికృష్ణ ఫోన్ చేసి భువనేశ్వరి తో మాట్లాడారు.
Read more ...

Thursday, 21 May 2015

భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 30 మంది మృతి

గత రెండు రోజులుగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు 30 మంది మృతి చెందారు.ఒక్క కరీంనగర్ జిల్లాలోనే గురువారం 6గురు చనిపోయారు.మరో మూడు,నాలుగు రోజులపాటు ఎండ తీవ్రత బాగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
నల్గొండ,నిజామాబాద్ జిల్లాల్లో గురువారం 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.రామగుండంలో 46 డిగ్రీల, విజయనగరం,శ్రీకాకుళం,ఒంగోలు,ఆదిలాబాద్ లో 45 డిగ్రీల,హైదరాబాద్ లో 44 డిగ్రీల,వరంగల్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో రెండు రోజులు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.సాయంత్రం సమయంలో కూడా వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎండకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.మధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటికి వెల్లకుంటేనే మంచిది.మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను,వృద్దులను బయటకు పంపించకూడదు.
రోజుకు కనీసం 3 లీటర్ల మంచినీళ్ళు తీసుకోవాలి.కొబ్బరి నీళ్ళు,నిమ్మరసం,మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.వడదెబ్బ బారిన పడితే ఉప్పు,నిమ్మరసం  కలిపిన నీరు తాగాలి.
Read more ...

Wednesday, 29 April 2015

గ్రామ పంచాయతీల్లో నీరు-చెట్టు అవగాహన సదస్సులు : ఏపీ

మే 2 నుంచి మే 11 వరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామ పంచాయతీల్లో నీరు-చెట్టు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు.
ఈ సదస్సులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీని మండల స్థాయి కమిటీ సందర్శిస్తుంది.
నీటిపారుదల శాఖలోని ఒక ఇంజనీరింగ్ అధికారి, రెవెన్యూ, మండల అభివృద్ధి అధికారి, మండల వ్యవసాయధికారి, ఉపాధి హామీ ఏపీవో, అటవీ సంరక్షణ అధికారి తో పాటు నీరు చెట్టుతో సంబంధం ఉన్న ఇతర మండలస్థాయి అధికారులు ఈ బృందంలో ఉంటారు.
వీరు రోజు రెండు సార్లు పంచాయతీలను సందర్శించాల్సి ఉంటుంది.
Read more ...

Tuesday, 28 April 2015

ఢిల్లీ కి చేరిన ‘ఎటకారం’ చిత్ర నటుడు విజయ్ మృతదేహం

నేపాల్ భూకంపంలో నేపధ్యంలో షూటింగ్ విరమించుకుని ‘ఎటకారం’ సినిమా యూనిట్ సభ్యులు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంలోనే మరోసారి భూకంపం సంభవించడంతో ఎటకారం సినిమా నటుడు, నృత్య దర్శకుడు అయిన విజయ్(25) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన 10 నిముషాలకే విజయ్ మృతి చెందారు. ప్రస్తుతం విజయ్ మృతదేహం ఢిల్లీ కి చేరుకుంది.
బుధవారం మద్యాహ్నానికి విజయ్ మృతదేహం హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతరం మృతదేహాన్ని అక్కడి నుంచి విజయ్ స్వస్థలమైన గుంటూరు జిల్లా బాపట్లకు తరలించనున్నారు.
Read more ...

Sunday, 26 April 2015

నేపాల్ భూకంపంలో మృతిచెందిన ఎటకారం సినిమా డ్యాన్స్ మాస్టర్

ఎటకారం సినిమా అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ విజయ్ నేపాల్ భూకంప ప్రమాదంలో మృతి చెందారు.
కేమెర మెన్ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం: ఎటకారం సినిమా షూటింగ్ కోసం సినిమా యూనిట్ సభ్యులు నేపాల్ కి వెళ్లారు.
అయితే నేపాల్ భారీ భూకంపం నేపధ్యంలో వారు తమ షూటింగ్ ని అర్ధాంతరంగా ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. నేపాల్ దాటి కొంత దూరం వచ్చారు. మూడు వాహనాల్లో చిత్ర యూనిట్ బయలుదేరింది.
యూనిట్ సభ్యులతో విజయ్ మూడవ వాహనంలో ప్రయాణిస్తున్నాడు.
ఈ సందర్భంలోనే మరోకసారి భూకంపం సంభవించడంతో మూడవ వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో విజయ్ గాయపడ్డారు.
ఘటన స్థలంలో ఉన్న పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించిన 10 నిముషాలకే ఎటకారం డ్యాన్స్ మాస్టర్ విజయ్ మృతి చెందారు. ప్రస్తుతం భాండాలో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా అక్కడే పోలీసు స్టేషన్ లో నిరీక్షిస్తున్నారు.
 గుంటూరు జిల్లా బాపట్ల విజయ్ స్వస్థలం. ప్రస్తుతం మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Read more ...

కన్న కొడుకును హత్యచేసిన తల్లిదండ్రులు

తిరుపతి దిగువ సాంబయ్యపల్లిలో కన్న తల్లిదండ్రులే తమ కొడుకును హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం గత కొద్ది రోజులుగా రాంబాబు అనే యువకుడు తన ప్రేమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులను హింసిస్తున్నాడు. ఈ వేదింపులను తప్పుకోలేని రాంబాబు తల్లిదండ్రులు తమ కొడుకును హత్య చేసి పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Read more ...

Friday, 24 April 2015

ఏపీ కి ప్రత్యేక హోదా లేనట్టేనా

ఏపీ కి ప్రత్యేక హోదా లేనట్టేనా అంటే ఈరోజు కేంద్ర మంత్రి ఇంద్ర జిత్ చెప్పిన దాని ప్రకారం అది నిజమే అని అర్ధమౌతుంది.
ఈరోజు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, మాగంటి బాబు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.ఆయన ఇచ్చిన సమాధానం ప్రకారం ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని,ఏపీ,తెలంగాణా తోపాటు ఇతర రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయి,14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇచ్చిందే తప్ప ప్రత్యేక హోదా ఇవ్వలేదు,14వ ఆర్థిక సంఘంలో పలు మార్పులు జరిగాయని తన సమాధానంలో తెలిపారు మంత్రి ఇంద్రజిత్ సింగ్.
ఐతే పారిశ్రామిక ప్రోత్సాహకాలు కల్పిస్తాం,మొత్తం పెట్టుబడిలో 15 శాతానికి సమానమైన మొత్తానికి పన్ను మినహాయింపు ఇస్తాము,అదనపు పెట్టుబడి ప్రోత్సాహకం 2020 మార్చి 31 వరకు పొడిగిస్తాము,కొత్తగా ఏర్పాటు చేసుకునే యూనిట్లకు యంత్ర సామాగ్రి వర్తింపు రేటును 35 శాతం పెంచుతామని అన్నారు.
కేంద్రం మోసం చేసిందని,మాట తప్పిందని విపక్షాలు విరుచుకుపడ్డాయి.
Read more ...

Thursday, 23 April 2015

తిరుమలలో బుల్లెట్ల కలకలం

తిరుమలలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. తనిఖీ సిబ్బంది GMC టోల్ గేట్ దగ్గర లగేజీ బ్యాగ్ లో 8 బుల్లెట్లను గుర్తించారు. అధికారులు ఆ బ్యాగ్ ఎవరిదీ బుల్లెట్లను ఎందుకు తెచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు టోల్ గేట్ వద్దకు చేరుకుని సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read more ...

ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు విజయవాడ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో విడుదల చేశారు.

ఈ సంవత్సరం 62.13% ఉత్తీర్ణత కు  గాను అమ్మాయిలు 67%,బాలురు 59% ఉత్తీర్ణత  సాధించారు.మొత్తం 4,61,932 మంది విద్యార్థులు జనరల్ కేటగిరిలో హాజరు కాగా ఒకేషనల్ కి 26,913 మంది విద్యార్థులు హాజరయ్యారు.జనరల్ కేటగిరిలో 52 శాతం మందికి ‘ఏ’ గ్రేడ్ రాగా ఒకేషనల్ లో 60 శాతం మందికి ‘ఏ’ గ్రేడ్ లభించింది.
ఐతే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 4 శాతం ఉత్తీర్ణత పెరిగింది.ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో నిలవగా కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది.మే 25 నుండి జూన్ 2 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు.
Read more ...

సినీనటి నీతూఅగార్వల్ పై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదు

ఏపీ లోని కర్నూల్ జిల్లా రుద్రవరం పోలీసు స్టేషన్ లో సినీనటి నీతూఅగర్వాల్ పై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదైంది.నీతూ అగర్వాల్ తో ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీ ప్రేమ ప్రయాణం అనే చిత్రాన్ని నిర్మించాడు. పోలీసులు నీతూపై ఎర్రచందనం చెట్లు నరకడం, కొనుగోలు, స్మగ్లర్ల తో ములాఖత్, అక్రమ రవాణా వంటి తదితర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. మస్తాన్ వలీతో పాటు పలువురు ఎర్రచందనం స్మగ్లర్లకు ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి నిధులు బదిలీ అయినట్లు గుర్తించిన పోలీసులు ఆమె అరెస్టుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో నీతూ కోసం ముంబై, బెంగళూరులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read more ...

Sunday, 19 April 2015

బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని,గవర్నర్ లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు 65వ జన్మదినాన్ని సోమవారం జరుపుకుంటున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ,గవర్నర్ నరసింహన్ ఉదయమే ఫోన్ ద్వారా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఘనంగా జరిగాయి.రెండు రాష్ట్రాల నాయకుల సమక్షంలో కార్యకర్తలు,అభిమానులు తెచ్చిన 65 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు చంద్రబాబు నాయుడు.


చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రక్తదాన శిబిరంతో పాటు దంత,నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నా జీవితం తెలుగు జాతికి అంకితం,రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని అన్నారు.
Read more ...

Saturday, 11 April 2015

TTD చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి నియామకం

నూతంగా 18 మంది సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటైంది. తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ నుంచి ముగ్గురు TDP శాసన సభ్యులకు మరియు BJP కి కూడా ఈ బోర్డులో చోటు కల్పించారు. TTD చైర్మన్ గా చదల కృష్ణమూర్తి నియామకం అయ్యారు.
Read more ...

జాతీయ కస్టమ్స్ అకాడమీకి శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న జాతీయ కస్టమ్స్ అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీ తో పాటు అశోక్ గజపతిరాజు మరియు వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
Read more ...

Friday, 10 April 2015

అదే జరిగితే ప్రభుత్వం పై నా పోరాటం తప్పదు - పవన్ కళ్యాణ్


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పాడు.ఆంధ్రప్రదేశ్ రాజధానికి రైతుల నుండి అక్రమంగా భూములు లాక్కోవద్దని రైతుల దగ్గరికి వెళ్లి మరీ కలిశాడు కొన్ని రోజుల క్రితం.ఇప్పుడు అదే విషయమై మరోసారి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ క్రింది విధంగా ట్వీట్ చేశాడు ..... "ఈ రోజు మీడియా వార్తలు ప్రకారం(అం.ప్ర) ప్రభుత్వం,రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు మీద భూసేఖరణ చట్టం ప్రయోగించనున్నట్టు హైకోర్టుకి తెలిపారు.", "ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి సిద్ధంగా వున్నాను." భూసేకరణ చట్టం ప్రయోగిస్తే,రైతులకు అండగా పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నానని తన ట్వీట్ లో తెలిపారు పవన్ కళ్యాణ్.  
Read more ...

ఆప్కాబ్ నూతన అధ్యక్షుడిగా పిన్నమనేని

ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
నూతన ఆప్కాబ్ అధ్యక్షుడిగా పిన్నమనేని వెంకటేశ్వర రావుని, వైస్ ఛైర్మెన్ గా వరపుల బోగిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అధ్యక్ష,ఉపాధ్యక్ష పదవులకు ఒక్కొక్కనామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఈ ఎన్నిక ఏకాగ్రివమైంది.
వీరికి ఎన్నికల అధికారి తేజోవతి దృవీకరణ పత్రాలను అందజేశారు.
Read more ...

Tuesday, 7 April 2015

రుయా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు

బుధవారం శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్ర చందనం కూలీలను చంపడంతో వారికి తిరుపతి రుయా ఆసుపత్రి లో పోస్ట్ మార్టం జరుగుతున్న సందర్బంగా అక్కడికి చనిపోయిన వారి బంధువులు భారీగా చేరుకొని ఆందోళన చేస్తున్నారు.అనేక ప్రజాసంఘాలు కూడా ఈ విషయమై ఆందోళన చేస్తున్నారు.
పోస్ట్ మార్టం సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.ఐతే ఆసుపత్రికి వచ్చే రోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.
తమిళనాడులో ఆందోళనలు తీవ్రంగా జరుగుతుండడంతో అక్కడికి వెళ్ళే బస్సులని APSRTC ఈరోజు కూడా ఆపేసింది.తమిళనాడు లోని ఆంధ్ర భవన్ల దగ్గర భారీ బందోబస్తు పెట్టారు.
ఈ ఘటనలో చనిపోయినవారంత తమిళనాడు కు చెందిన వారే.అందులో 4గురు వేలూరు,8మంది విల్లుపురం,ఇంకో 8 మంది తిరువన్నామలై కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
Read more ...

Wednesday, 1 April 2015

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిగా ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరును ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.
సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు ముఖ్యమంత్రి.రాజధానికి వాస్తుకు తగ్గట్టే పేరు కూడా బలంగా ఉంది,ఇంద్రుడు పాలించిన నగరంగా అమరావతి ప్రసిద్ధి చెందింది,నాలుగు వందల సంవత్సరాలపాటు శాతావాహనులు పరిపాలించారు అమరావతిని,అలాగే అమరావతికి ధాన్యకటకంగా పేరుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.
బౌద్ధులు పరమ పవిత్రంగా భావించిన నగరం అమరావతి,ప్రపంచంలోనే అధునాతన నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం,దేశ వ్యాప్తంగా ఎన్నికైన వారసత్వ నగరాల్లో అమరావతి ఒకటి ,ఈ రాజధాని ప్రజా రాజధానిగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.
సింగపూర్ అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ఈ సందర్బంగా విడుదల చేశారు,సింగపూర్ ఉచితంగా మాస్టర్ ప్లాన్ ను అందించింది,రాజధాని మాస్టర్ ప్లాన్ లో మొత్తం మూడు భాగాలు ఉంటాయి,మే-15 లోగా మాస్టర్ ప్లాన్ ఇస్తారు,15 లక్షల ఎకరాల్లో ల్యాండ్ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తాము,21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతిస్తాం,గన్నవరం ఎయిర్ పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయం మారుస్తాం,కృష్ణా నదిపై దాదాపు 5 వంతెనలు ఏర్పాటు చేస్తాము,స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు,ప్రత్యేక హోదా పై త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అని సీఎం తెలిపారు.
Read more ...

బతికున్నంత కాలం జైల్లోనే,కర్నూల్ కోర్టు సంచలన తీర్పు


ఈరోజు కర్నూల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.వరుస అత్యాచారాలకు పాల్పడుతున్న ఇద్దరు ఆటో డ్రైవర్లు బతికున్నంత కాలం జైల్లోనే ఉండాలని అరుదైన తీర్పును ఇచ్చారు జడ్జీ వెంకట జ్యోతిర్మయి . ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలే లక్ష్యంగా గత కొంత కాలంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఆటో డ్రైవర్లు మట్టి రవి,శ్రీను లు.ఇది వరకు అరెస్ట్ చేసినా బెయిల్ మీద బయటికి వచ్చి మళ్ళీ అత్యాచారాలకు పాల్పడుతుండేవారు వీరు.కర్ణాటకకు చెందిన ఒక మహిళను కొన్ని రోజుల క్రితం అత్యాచారం చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేసి విచారించగా దాదాపు 20 మంది యువతుల మీద అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నారు ఈ దుర్మార్గులు. చనిపోయేవరకు జైల్లోనే ఉండాలని ఈరోజు వీరికి వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది.వీరి తరుపున వాదించడానికి ఒక్క న్యాయవాది కూడా ముందుకు రాలేదు.
Read more ...

Thursday, 19 February 2015

ముగిసిన రామానాయుడు అంత్యక్రియలు

తెలుగు సినీ లోకం కన్నీటి సంద్రమైంది.తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది.
రామానాయుడు స్టూడియోలో మూవీ మొఘల్ రామానాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి.పోలీసులు గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపారు.

పెద్ద కుమారుడు దగ్గుబాటి సురేష్ బాబు రామానాయుడు చితికి నిప్పంటించారు.కుమారులు,మనువళ్ళు,కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

అంత్యక్రియలకు భారీగా అభిమానులు,కుటుంబసభ్యులు,సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

అంతకముందు రామానాయుడు అంతిమయాత్రకు వేలాదిగా మంది తరలివచ్చి ఘన నివాళి ఘటించారు.బాలీవుడ్ నటులు అనిల్ కపూర్,భోని కపూర్,శ్రీదేవి లతో పాటు పలువురు రాజకీయ నాయుకులు,సినీ పెద్దలు చివరిసారి రామానాయుడు పార్థీవదేహాన్ని దర్శించుకున్నారు.

































Read more ...
Designed By Published.. Blogger Templates