Radio LIVE


Breaking News
Showing posts with label Entertainment. Show all posts
Showing posts with label Entertainment. Show all posts

Tuesday, 5 May 2015

ఫేస్ బుక్ సీవోవో భర్త డేవిడ్ మృతి

సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ సీవోవో సెర్లిన్ సాండ్ బర్గ్ భర్త డేవిడ్ గోల్ బర్గ్ మృతి చెందారు.
మంగళవారం 47 ఏళ్ల డేవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు వెల్లడించారు.
మెక్సికోలోని ఓ రిసార్స్వ కు డేవిడ్ గోల్డ్ బర్గ్ ఫ్యామిలీ ట్రిప్ కోసం వెళ్లారు. డేవిడ్ రిసార్ట్స్ లోని హోటల్ జిమ్ లో ట్రేడ్ మిల్ వాక్ చేస్తుండగా జారీ పడడంతో అతని తలకు గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న డేవిడ్ ను చికిత్స నిమిత్తం న్యూవో వెల్లట్రా లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
అయితే డేవిడ్ తలకు తీవ్రంగా గాయలవడం , రక్తస్రావం ఎక్కువవ్వడం వలన అతన్ని రక్షించలేక పోయామని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
Read more ...

Monday, 4 May 2015

బాహుబలి చిత్రంలో భారీ శివలింగంతో ప్రభాస్

టాలీవుడు జక్కన ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క జంటగా తెరకెక్కనున్న బారీ చిత్రం ‘బాహుబలి’ (ద బిగినింగ్).
రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించి కథానాయకుడు ప్రభాస్ పోస్టర్ ను సోమవారం ట్విట్టర్ లో పోస్టు చేశారు. భారీకాయుడైన ప్రభాస్ జలపాతం నడుమ భారీ శివలింగాన్ని భుజాలపై మోసుకువస్తున్న ఈ పోస్టర్ ని చూస్తుంటే బాహుబలి చిత్రంపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలిచే రాజమౌళి బాహుబలి విశేషాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈ సినిమాపై అంచనాలను రోజురోజుకు పెంచేస్తున్నారు.
మే 1న విడుదల చేసిన పోస్టర్ కు ఆద్భుతమైన స్పందన రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ట్విట్టర్ వేదికగా దర్శకుడు రాజమౌళి సోమవారం ప్రభాస్ పోస్టర్ ను విడుదల చేశారు.
Read more ...

Saturday, 2 May 2015

ఆడ శిశువుకు జన్మనిచ్చిన ప్రిన్స్ విలియమ్స్ భార్య కేట్

ప్రిన్స్ విలియమ్స్ తండ్రి అయ్యాడు.
పండంటి ఆడ శిశివుకు అతని భార్య కేట్ మిడిల్ టన్ జన్మనిచ్చింది.
బ్రిటన్ సింహాసనానికి ఈ పాప నాల్గవ వారసురాలు. శనివారం ఉదయం ఎనిమిదన్నరకు కేట్ మిడిల్ టన్ ప్రసవించినట్లు కేన్సింగ్ టన్ రాజ ప్రాసాదం అధికార వర్గాలు ప్రకటించాయి.
ఈ సందర్భంగా రాజా కుటుంబీకులు భారీ సంబరాల వేడుకకు సిద్దమవుతున్నారు.
Read more ...

మే 29కి సల్మాన్ ఖాన్ కేసు విచారణ వాయిదా

ప్రముఖ బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ అక్రమయుదాల కేసు ఈ నెల 29కి వాయిదా పడింది. సాక్షుల వాగ్మూలలను శనివారం జ్యూడిషియల్ మేజిస్టేట్ రికార్డ్ చేశారు.
కోర్టు ముందు ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను ఉంచనందున ఈ కేసు విచారణను 29 వ తేదికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఈ కండల వీరుడు 1998 లో రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణల నేపధ్యంలో ఇతనిపై కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.
Read more ...

“ఇండియన్ ఐడిల్ జూనియర్” న్యాయనిర్ణేతగా మారనున్న సోనాక్షి సిన్హా

బాలీవుడు నటి సోనాక్షి సిన్హా ఇండియన్ ఐడిల్ జూనియర్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్ చాలా పాపులర్ అయింది. అంతేకాదు ఈ ట్రైలర్ లో ఒక చిన్నారి పాడిన పాటకు సోనాక్షి స్టెప్పులు కూడా వేయడం విశేషం.
అభిమానుల నుంచి ఈ ట్రైలర్ కి వచ్చిన స్పందనకు సోనాక్షి సిన్హా ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు వెల్లడించింది.
Read more ...

Friday, 1 May 2015

ఈ నెల 29న పెళ్లికి సిద్దమైన నవ్వుల హీరో అల్లరి నరేష్

నవ్వుల హీరో అల్లరి నరేష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ యువ హీరోకి కృష్ణాజిల్లాకు చెందిన విరూపతో వివాహం నిశ్చయం అయ్యింది.
వీరు ప్రస్తుతం చెన్నై లో స్థిరపడ్డారు. 
శుక్రవారం చెన్నైలోని లీలా ప్యాలస్ లో నరేష్-విరూపల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.
కుటుంబ సభులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నెల 29న హైదరాబాద్ నగరంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రాత్రి 9 గంటల 3 నిముషాలకు నరేష్-విరూపల వివాహం జరగనుంది. ఈ సందర్భంగా నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ బంధు, సపరివార సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని పేర్కొన్నారు.
Read more ...

రాజామౌళి బాహుబలి పోస్టర్ పై ప్రశంసలు

బాలివుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రముఖ తెలుగు దర్శకుడు S.S. రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు.

బాహుబలి సినిమా హిందీ విడుదల హక్కుల్ని కొనుకున్న కరణ్ జోహార్ రాజమౌళి సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడరని మెచ్చుకున్నారు. బాహుబలి సినిమాకి చెందిన సరికొత్త పోస్టర్ ని శుక్రవారం రాజమౌళి ట్విటర్ లో పెట్టారు.
ఈ సినిమా హిందీ విడుదల హక్కుల్ని కొన్న కరణ్ జోహార్ కూడా బాహుబలి పోస్టర్ ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి రాజమౌళిని ప్రశంసించారు. కాగా జులై 10న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు కరణ్ జోహార్ ప్రకటించారు.
Read more ...

విజయవాడలో తొలి పోస్టల్ ATM ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా తపాలాశాఖ పోస్టల్ ATM ను విజయవాడలో ప్రారంభించింది. కాళేశ్వరరావు మార్కెట్ లో ఉన్న ప్రధాన తపాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సిర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ B V సుధాకర్ పోస్టల్ ATM ను ప్రారంభించారు. అంతేకాదు రాబోయే మరో 10 రోజుల్లో జంట నగరాలతో పాటు మరో రెండు ప్రాంతాల్లో 4 ATM లను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ATM లను ఖాతాదారులు తపాలా శాఖకు సంబంధించి తమ లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చునని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 95 హెడ్ పోస్టాఫీసుల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ-సేవలు అందుబాటులోకి రానున్నాయని సుధాకర్ వెల్లడించారు. అధికారులు మనియార్డర్ సేవల్ని ఉపసంహరించుకోనున్నట్లు వస్తున్న ఊహగానాల్ని తోసిపుచ్చారు.
Read more ...

ఉత్తమ విలన్ సినిమా విడుదల నిలిపివేత

ప్రపంచవ్యాప్తంగా మే 1 న “ఉత్తమ విలన్“ చిత్రం 1500 ధియేటర్లలో విడుదల చేయనున్నామని గతంలో ఈ చిత్ర వర్గాలు ప్రకటించాయి.
అయితే శుక్రవారం విడుదల కావాల్సిన ఈ సినిమాను ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా సినిమా విడుదలను నిలిపివేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
దీంతో శుక్రవారం ఉదయం ధియేటర్లకు వెళ్లిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, మాటలు, స్కీన్ ప్లే కమలహాసన్ అందించారు.
 కాగా ఈ సినిమాలో కథానాయకుడిగా కమలహాసన్, పూజకుమార్, ఆండ్రియా, K.బాలచందర్, నాజర్, ఊర్వశి, విశ్వనాధన్ లు కీలక పాత్రలు పోషించారు.
 అయితే గత కొంతకాలంగా “ఉత్తమ విలన్” సినిమాలో “వరాహ అవతారాన్ని” హేళన చేసేలా సాహిత్యం, సన్నివేశాలు ఉన్నయని, వాటిని తొలగించాలని VHP నేతలు డిమాండ్ చేసినప్పటికీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో VHP కార్యకర్తలు జేపాక్ సమీపంలో రెండ్రోజుల క్రితమే ఆందోళన చేపట్టారు గమనార్హం.
Read more ...

Thursday, 30 April 2015

మా నాన్నగారి కోసం ఓ వెబ్ సైట్ : అమితాబ్ బచ్చన్

ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం ఓ వెబ్ సైట్ ను ప్రారంభించే పనిలో ఉన్నారు.ఈ వెబ్ సైట్ ను తన తండ్రి , ప్రముఖ రచయిత “హరివంశ్ రాయ్ బచ్చన్” కు అంకితం చేయనున్నట్లు బిగ్ బీ తెలిపారు.
ఈ వెబ్ సైట్ లో తన తండ్రి గురించి సమగ్రమైన సమాచారం ఉంటుందని ఆయన వెల్లడించారు.అంతేకాదు తన తండ్రి హరివంశ్ రాయబచ్చన్ గురించి అభిమానులకు తమకు తెలిసిన అంశాలను తనతో పంచుకోవాలని, తమ వద్ద ఇందుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా, ఫోటోలు ఉన్నా పంపండంటూ ట్విట్టర్లో మెయిల్ అడ్రస్ కూడా పెట్టారు.
హరివంశ్ రాయబచ్చన్
హరివంశ్ రాయ్ గురించి ఎలాంటి విషయాన్నైనా షేర్ చేసుకోవాలంటే thebachchanfamily@gmail.com కు మెయిల్ చేయాలని బిగ్ బీ అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరారు.
Read more ...

తండ్రి కలను నేరవేర్చినందుకు సంతోషంగా ఉంది : నటి సుస్మితా సెన్

బెంగాలీ చిత్రసీమలో నటించాలనే తన తండ్రి కలను నేరవేర్చానని మాజీ విశ్వసుందరి, బాలివుడ్ నటి సుస్మితా సేన్ అన్నారు.తాను నటించిన బెంగాలీ చిత్రం నిర్బాక్ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ.. బెంగాలీ చిత్రంలో నటించి నాన్న కల నేరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ చిత్రం ప్రారంభం నుంచి చిత్ర దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ ప్రతి విషయంలో తనకు సహకరించి ప్రోత్సహించారని ఆమె వెల్లడించారు. దర్శకుడు శ్రీజిత్ మాట్లాడుతూ బెంగాలి శైలికి తగినట్లు సుస్మిత చక్కగా నటించారని కొనియాడారు.
Read more ...

Wednesday, 29 April 2015

నేను హిందూముస్లింను : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్

బుధవారం బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టు కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ను మేజిస్ట్రేట్ పలు ప్రశ్నలు అడిగారు. నీది ఏ మతం అని మేజిస్ట్రేట్ ప్రశ్నించగా .. తాను ఏ మతానికి సంబంధించినవాడిని కాదని, భారతీయుడనని మొదట సల్మాన్ బదులిచ్చారు. అయితే సూటిగా సమాధానం చెప్పాలని మేజిస్ట్రేట్ ఆయనను ఆదేశించగా నా తండ్రి ముస్లిం, నా తల్లి హిందువు. అందుకే నేను హిందూముస్లింను అని సల్మాన్ వాంగ్మూలం ఇచ్చారు.
Read more ...

Friday, 24 April 2015

42 వ పడిలోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 42 వ పడిలోకి అడుగు పెట్టారు. క్రికెట్ లో రికార్డులు నెలకొల్పి , తనదైన ముద్ర వేసిన సచిన్ తన 16 వ ఏటే క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టాడు. జన్మదినం సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ ఫఠాన్, రహనే, అనిల్ కుంబ్లే, రోహిత్ శర్మ, ఇతర క్రికెటర్లు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు సచిన్ కు గ్రాండ్ విషెస్ ను తెలియజేశారు.
Read more ...

షాహిద్ కపూర్ సరసన సచిన్ టెండూల్కర్ కూతురు సారా?

తాజాగా ఓ రూమర్ హల్ చల్ చేస్తుంది. త్వరలోనే బాలీవుడ్ లోకి సచిన్ టెండూల్కర్ కూతురు అడుగుపెట్టనుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఓ మూవీలో షాహిద్ కపూర్ సరసన నటించనుందని వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే షారుఖ్ కొడుకు ఆర్యన్ , శ్రీదేవి కూతురు జాహ్నవి ఓ సినిమాలో జంటగా నటించానున్నరనే వార్తా సామజిక మాధ్యమాల్లో కొన్నాళ్లు పుకార్లు షికార్లు చేశాయి. ఇదీ అలాంటి రూమరేనేమో!
Read more ...

మోడల్ పై పోలీసులు అత్యాచారం: ముగ్గరు అరెస్ట్

ముంబాయి లోని పోలీసు శిబిరంలో ముంబైకి చెందిన ఓ మోడల్ పై పోలీసులు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను అరెస్టు చేసినట్లు ముంబాయి పోలీసు వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్ 4 న ముంబైకి చెందిన ఓ మోడల్ ఆడిషన్ నిమిత్తం 5నక్షత్రాల హోటల్ కి వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకొని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. అనంతరం తనని పోలీసు శిబిరానికి తీసుకెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు, అనంతరం తన వద్ద ఉన్న 4.5 లక్షలు నగదు తీసుకున్నట్లు మోడల్ ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు ముంబాయి పోలీసు కమిషనర్ రాకేశ్ మరియా కు పోన్ లో మెడల్ సమాచారమందించింది.
స్పందించిన కమిషనర్ తన కార్యాలయానికి ఆమెను పిలిపించి పూర్తి వివరాలు సేకరించి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ పొలీస్ ఇన్ స్పెక్టర్లను, ఒక హెడ్ కానిస్టేబుల్ ను అరెస్టు చేసినట్లుకమిషనర్ వెల్లడించారు.
Read more ...

Thursday, 23 April 2015

పీపుల్స్ మ్యాగజైన్-2015 అందమైన మహిళగా సాండ్రా

పీపుల్స్ మ్యాగజైన్ 2015 సంవత్సరానికి గాను ప్రపంచ అత్యంత అందగత్తేగా హాలీవుడ్ నటి సాండ్రా బులోక్ ఎంపికయ్యారు.
గతంలో మూడు సార్లు పీపుల్స్ మ్యాగజైన్ ప్రపంచ అత్యంత అందగత్తెగా గౌరవాన్ని పొందిన నటి జూలియా రాబర్ట్స్.
కాగా ఈ సారి సాండ్రా ఫోటోని ముఖ చిత్రంగా పీపుల్స్ మ్యాగజైన్ తన తదుపరి సంచికను ముద్రించనున్నట్లు తెలిపింది.
Read more ...

‘హలో’ పేస్ బుక్ కొత్త యాప్

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని చూరగొంటున్న పేస్ బుక్ ఇప్పుడు మరో కొత్త యాప్ ను విడుదల చేసింది.
స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. పేస్ బుక్ దీన్నిదృష్టిలో ఉంచుకొని ఈ కొత్త యాప్ ను రూపొందించింది.

ఎవరికైనా తెలియని నెంబర్ నుంచి కాల్స్ వస్తుంటే, ముఖ్యంగా పనిలో బిజీగా ఉన్న సమయంలో ఇలాంటివి వస్తే చిరాకేస్తుంది.
ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలిసిపోయేలా పేస్ బుక్ ‘హలో ‘ పేరుతో ఓ కొత్త యాప్ ను విడుదల చేసింది.
ఈ యాప్ పేస్ బుక్ తో అనుసంధానమై ఉంటుందని తెలిపింది.


దీంతో మన పేస్ బుక్ స్నేహితుల ఆధారంగా మనకు ఎవరు కాల్ చేస్తున్నారో సులభంగా గుర్తించోచ్చని పేర్కొంది.


అంతే కాదు.. ఈ యాప్ ని వినియోగించుకునే వారికి తమ ఫోన్ లో నెంబర్ ను సేవ్ చేసుకోకున్నా.. కాల్ వస్తే మాత్రం వారి పేరు తెలిసిపోతుందని, పేస్ బుక్ లోని మిత్రులకు ఈ యాప్ ద్వారా సులభంగా కాల్ చేసుకోవచ్చునని, అనవసరమైన కాల్స్ రాకుండా నెంబర్లను బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టుకునే సదుపాయాన్ని దీని ద్వారా కల్పించినట్లు పేస్ బుక్ పేర్కొంది.
Read more ...

Wednesday, 22 April 2015

భారతదేశపు అత్యధిక రీట్వీట్ గా రికార్డ్ సృష్టించిన జైన్ మాలిక్ తో షారుఖ్ సేల్ఫీ

ఇటివలే బాలీవుడు నటుడు షారుఖ్ ఖాన్ వన్ డైరెక్షన్ బృందం నుంచి బయటకు వెళ్ళిపోయిన ప్రముఖ యువ గాయకుడు జైన్ మాలిక్ తో దిగిన సేల్ఫీ రికార్డు సృష్టించింది. ఇటివల లండన్ లో జరిగిన ఏషియన్ అవార్డ్స్ 5 వ వార్షికోత్సవంలో పాల్గొన్న షారుఖ్ ఖాన్ యువ గాయకుడు జైన్ మాలిక్ తో కలిసి బ్లాక్ అండ్ వైట్ సేల్ఫీ తీసుకున్నారు.


షారుఖ్ ఖాన్ తో జైన్ మాలిక్ బ్లాక్ అండ్ వైట్ సేల్ఫీ
షారుఖ్ ఆ ఫోటోతో పాటు ఈ అబ్బాయి చాలా ప్రశాంతంగా ఉన్నాడు, అల్లా దీవెనలు ఎప్పుడూ అతనికి ఉండాలని ట్వీట్ చేశారు. కాగా అత్యధికంగా రీట్విట్ అయిన భారతదేశపు ప్రముఖుల ఫోటోగా ఈ ఫోటో గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు ఈ సేల్ఫీని 1,11,720 మంది రీట్వీట్ చేయగా, 1,57,294 మంది లైక్ చేశారు.
Read more ...

Friday, 17 April 2015

‘బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్’ ట్రైలర్ విడుదలకు ముందే లీక్

జాక్ స్నైడర్ దర్శకత్వంలో రాబోతున్న ‘బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్’ సినిమా ట్రైలర్ విడుదలకు ముందే ఇంటర్ నెట్ లో బహిర్గతమైంది. బ్యాట్ మ్యాన్ గా బెన్ అప్లేక్, సూపర్ మ్యాన్ గా హెన్రీ కావిల్ నటిస్తుండగా మరో ముఖ్య పాత్రలో అమీ ఆడమ్స్ నటిస్తున్నారు. వచ్చే సంవత్సరం 2016,మర్చి 25 న విడుదల కానున్న ఈ సినిమాను ఎవరో హ్యాండీ కేమ్ తో ఈ సినిమా ట్రైలర్ ను షూట్ చేసి ఇంటర్ నెట్ లో పెట్టారు.అయితే కొద్ది నిమిషాల్లోనే దానిని తొలగించారు. హలివుడు పత్రిక ఇది స్పానిష్ ఉపశీర్శికతో ఉన్నట్లు పేర్కొంది. సోమవారం నుంచి ఐమాక్స్ ధియేటర్లలో ఈ చిత్ర అధికార ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు.
Read more ...

Wednesday, 15 April 2015

నిర్మాతగా మారనున్న నటుడు నీల్ నితిన్

బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నిర్మాతగా మారనున్నారు. నితిన్ మిరాగ్ గ్రూప్ చైర్మెన్ మదన్ పాలివాల్ భాగస్వామ్యంతో చిత్రనిర్మాణం చేపట్టనున్నారు. తనచేతిలో ప్రస్తుతం నాలుగు స్క్రిప్టులు ఉన్నాయని, ఈ సంవత్సరం వాటిలో కనీసం రెండైన ప్రారంభిస్తామని హాస్యచిత్రాలను మాత్రం ఎంచుకోనని నీల్ ముఖేష్ అన్నారు.
Read more ...
Designed By Published.. Blogger Templates