టాలీవుడు జక్కన ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క జంటగా తెరకెక్కనున్న బారీ చిత్రం ‘బాహుబలి’ (ద బిగినింగ్).
రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించి కథానాయకుడు ప్రభాస్ పోస్టర్ ను సోమవారం ట్విట్టర్ లో పోస్టు చేశారు. భారీకాయుడైన ప్రభాస్ జలపాతం నడుమ భారీ శివలింగాన్ని భుజాలపై మోసుకువస్తున్న ఈ పోస్టర్ ని చూస్తుంటే బాహుబలి చిత్రంపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది.
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలిచే రాజమౌళి బాహుబలి విశేషాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈ సినిమాపై అంచనాలను రోజురోజుకు పెంచేస్తున్నారు.
మే 1న విడుదల చేసిన పోస్టర్ కు ఆద్భుతమైన స్పందన రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ట్విట్టర్ వేదికగా దర్శకుడు రాజమౌళి సోమవారం ప్రభాస్ పోస్టర్ ను విడుదల చేశారు.

No comments:
Post a Comment