బాలివుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రముఖ తెలుగు దర్శకుడు S.S. రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు.
బాహుబలి సినిమా హిందీ విడుదల హక్కుల్ని కొనుకున్న కరణ్ జోహార్ రాజమౌళి సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడరని మెచ్చుకున్నారు.
బాహుబలి సినిమాకి చెందిన సరికొత్త పోస్టర్ ని శుక్రవారం రాజమౌళి ట్విటర్ లో పెట్టారు.
ఈ సినిమా హిందీ విడుదల హక్కుల్ని కొన్న కరణ్ జోహార్ కూడా బాహుబలి పోస్టర్ ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి రాజమౌళిని ప్రశంసించారు.
కాగా జులై 10న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు కరణ్ జోహార్ ప్రకటించారు.
No comments:
Post a Comment