Radio LIVE


Breaking News

Friday, 1 May 2015

విజయవాడలో తొలి పోస్టల్ ATM ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా తపాలాశాఖ పోస్టల్ ATM ను విజయవాడలో ప్రారంభించింది. కాళేశ్వరరావు మార్కెట్ లో ఉన్న ప్రధాన తపాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సిర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ B V సుధాకర్ పోస్టల్ ATM ను ప్రారంభించారు. అంతేకాదు రాబోయే మరో 10 రోజుల్లో జంట నగరాలతో పాటు మరో రెండు ప్రాంతాల్లో 4 ATM లను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ATM లను ఖాతాదారులు తపాలా శాఖకు సంబంధించి తమ లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చునని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 95 హెడ్ పోస్టాఫీసుల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ-సేవలు అందుబాటులోకి రానున్నాయని సుధాకర్ వెల్లడించారు. అధికారులు మనియార్డర్ సేవల్ని ఉపసంహరించుకోనున్నట్లు వస్తున్న ఊహగానాల్ని తోసిపుచ్చారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates