మే 2వ వారంలోతెలంగాణ పంచాయతీ రాజ్ , ఇతీశాఖ మంత్రి కే.తారక రామారావు అమెరికా పర్యటించనున్నారు.
ఈ పర్యటన 15 రోజులపాటు జరగనుంది. ఈ పర్యటనలో KTR అమెరికాలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి,తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడానికి అమెరికాలోని పలు కంపెనీలు,పలువురు పారిశ్రామికవేత్తలతో, మరియు సంస్థలు సమావేశం అవుతారు.
తన అమెరికా పర్యటనకు సంబంధించి బుధవారం KTR ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అమెరికా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఐటీ, పారిశ్రామిక పాలసీలను వివరించునున్నట్లు తెలిపారు.
అంతేకాదు అమెరికా లో ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలను కూడా భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారని సమాచారం.
No comments:
Post a Comment