గత రెండు రోజులుగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు 30 మంది మృతి చెందారు.ఒక్క కరీంనగర్ జిల్లాలోనే గురువారం 6గురు చనిపోయారు.మరో మూడు,నాలుగు రోజులపాటు ఎండ తీవ్రత బాగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
నల్గొండ,నిజామాబాద్ జిల్లాల్లో గురువారం 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.రామగుండంలో 46 డిగ్రీల, విజయనగరం,శ్రీకాకుళం,ఒంగోలు,ఆదిలాబాద్ లో 45 డిగ్రీల,హైదరాబాద్ లో 44 డిగ్రీల,వరంగల్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో రెండు రోజులు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.సాయంత్రం సమయంలో కూడా వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎండకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.మధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటికి వెల్లకుంటేనే మంచిది.మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను,వృద్దులను బయటకు పంపించకూడదు.
రోజుకు కనీసం 3 లీటర్ల మంచినీళ్ళు తీసుకోవాలి.కొబ్బరి నీళ్ళు,నిమ్మరసం,మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.వడదెబ్బ బారిన పడితే ఉప్పు,నిమ్మరసం కలిపిన నీరు తాగాలి.
No comments:
Post a Comment