ఇజ్రాయెల్ తమ పంటల సాగుకు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, విధానాలను తెలంగాణ రాష్ట్రంలోను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పొచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇజ్రాయల్ లోని టెల్ అవీవ్ లో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు (అగ్రి టెక్ -2015) జరుగుతుంది.
ఈ సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన పొచారం బృందం వెళ్లింది. దీనిలో భాగంగానే బుధవారం వారు పలు వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి వివిధ పంటల సాగు విధానాన్ని పరిశీలించారు.
అనంతరం టెల్ అవీవ్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొఘల్ అనే గ్రామంలో పంటల సాగును అధ్యయనం చేశారు.
No comments:
Post a Comment