హైదరాబాద్ పాత బస్తీలో ఆకతాయి యువకులు నిర్వహించిన స్ట్రీట్ ఫైట్ లో ఇంటర్ చదువుతున్న 17 సంవత్సరాల నబీల్ అనే యువకుడు చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.wwf తరహాలో సంపన్నుల పిల్లలు బెట్టింగ్ లకు పాల్పడుతూ వీధి పోరాటాలకు దిగి ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన పాత బస్తీ మీర్ చౌక్ లో సంభవించింది.
నిజానికి ఈ ఘటన మే 3 నే జరిగింది.ఆక్సిడెంట్ జరిగిందని స్నేహితుల మృతుడి తల్లిని నమ్మించి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు.ఐతే మృతుడు నబీల్ తండ్రి దుబాయ్ నుండి వెంటనే హైదరాబాద్ చేరుకున్నాడు.అసలు ఆరోజు ఏమైందని నబీల్ స్నేహితులను ఆరా తీశాడు.తన కుమారుడి మరణం ఆక్సిడెంట్ వల్ల కాదు అని తెలుసుకొని మీర్ చౌక్ పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయట పడింది.మే 3 తెల్లవారుజామున 10 నుండి 12 మంది యువకుల బృందం మీర్ చౌక్ లోని ఒక వీధిలో స్ట్రీట్ ఫైట్ కు సన్నాహాలు చేసుకున్నారు.నబీల్ అహ్మద్ మరియు మొహమ్మద్ అనే యువకుడితో తలపడ్డాడు.మొహమ్మద్ పిడి గుద్దులకు కుప్పకూలాడు నబీల్.
నబీల్ మరణించాడు అని తెలుసుకొన్నాక అక్కడి వారు అది రోడ్డు ప్రమాదంలో మరణంగా చిత్రీకరించి నబీల్ ఇంట్లో తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి క్లూ లేకుండా చేశారు,పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసి విచారించగా వీడియో సహా నిజం బయటపడింది.నబీల్ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు.హత్యా నేరం కింద కేసు నమోదు విచారిస్తున్నారు పోలీసులు.
No comments:
Post a Comment