తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు లంచం ఇస్తూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.
సోమవారం జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని అందులో భాగంగా సికింద్రాబాద్ లోని లాలాగూడ స్టీవెన్ సన్ కుమారుడి ఇంట్లో రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీ కి అడ్డంగా దొరికిపోయాడు రేవంత్ రెడ్డి.అప్పటికే అక్కడే మాటు వేసి ఎదురు చూస్తున్న ఏసీబీ అదను చూసి రేవంత్ ను పట్టుకున్నారు.
రేవంత్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తు రెండు సంచులు కూడా పోలీసులు తీసుకెళ్ళారు.రేవంత్ మీద ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు పోలీసులు.
రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా ప్రలోభాలకు లోనుచేస్తున్నాడని స్టీవెన్ సన్ చెప్పాడు.
రేవంత్ రెడ్డి ని ఏసీబీ ఆఫీస్ లో విచారిస్తున్నారు.రేపు కోర్టు లో హాజరు పరుస్తారు.
అయితే రేవంత్ రెడ్డి,స్టీవెన్ సన్ ల మధ్య జరిగిన సంభాషణ ను ఏసీబీ విడుదల చేసింది.
ఈ వీడియో లో "బాసే నన్ను ఇక్కడికి పంపించారు.మీరేదైనా నెంబర్(money) చెప్తే నేను బాస్ తో మాట్లాడి సమాచారం అందిస్తాను.మీకు ఏలాంటి సమస్య రాదు,17 మంది ఎమ్మెల్యేలతో పాటు మీరు.తెలంగాణాలో పార్టీని నేనే లీడ్ చేసేది,నా కూతురి పెళ్లి అయ్యాక నేను ఫ్రీ అవుతాను,నీకేమైనా సమస్య వస్తే ఆంధ్రలో ఇప్పిస్తాను.నాకు కులం ఉంది,బంధువులు ఉన్నారు,జైపాల్ రెడ్డి నాకు మామ,జానారెడ్డి కూడా నాకు బంధువే,జానారెడ్డి పని అయిపోయింది, నేను వేం నరేందర్ రెడ్డి కి ఫైనాన్స్ చేస్తున్నాను అని రేవంత్ రెడ్డి వీడియోలో మాట్లాడారు.రెండున్నర అనే మాట వాడారు రేవంత్ ఈ వీడియో లో".
No comments:
Post a Comment