CRPF భూకంపదాటికి అతలాకుతలమైన నేపాల్ ను సహాయం అందించేందుకు మరో అడుగు ముందుకేసింది.
భూకంపంలో దెబ్బతిన్న ఒక గ్ర్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు CRPF సీనియర్ అధికారి ఒకరు అన్నారు.
CRPF ఐజీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. నేపాల్ లోని "కిరికట్ అనే గ్రామాన్ని" దత్తత తీసుకొని ఆ గ్రామంలో కూలిపోయిన కట్టడాలన్నీ తిరిగి నిర్మించాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే కిరికిట్ గ్రామాన్ని నేపాల్ భూకంపం సంభవించిన తర్వాత ఎవరు సందర్శించాలేదని తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు.
అందుకే ఆ గ్ర్రామాన్ని దత్తత తీసుకొని బాగుచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.
No comments:
Post a Comment