పెర్త్ : ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది.వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసుకొని గ్రూప్ లో అగ్రస్థానంలో కొనసాగుతుంది.మొదటి మ్యాచ్ లో పాక్ పై,రెండో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై,మూడో మ్యాచ్ లో ఈరోజు యూఏఈ పై అన్నీ ఘనవిజయాలే.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ 102 పరుగులకే ఆలౌట్ అయింది.ఆట మొదలైనప్పటి నుండి వికెట్ల పతనం ఆగలేదు.అశ్విన్ కెరీర్ లో అత్యత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.10 ఓవర్లలో 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి యూఏఈ పతనానికి కారకుడయ్యాడు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.ఫామ్ లో ఉన్న ధావన్ 14 పరుగులకే ఔటైనా కోహ్లీ తో కలిసి రోహిత్ శర్మ భారత్ కు విజయాన్ని అందించాడు.
రోహిత్ 57,కోహ్లి 33 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.భారత్ తన తదుపరి మ్యాచ్ ను మార్చ్ 6న వెస్టిండీస్ తో తలబడుతుంది.
United Arab Emirates Innings - 102
India Innings - 104/1 (18.5 overs)
Batting | Out Desc | R | B | 4s | 6s | SR |
Rohit Sharma | not out | 57 | 55 | 10 | 1 | 103.6 |
Shikhar Dhawan | c Rohan Mustafa b Naveed | 14 | 17 | 3 | 0 | 82.4 |
Virat Kohli | not out | 33 | 41 | 5 | 0 | 80.5 |
Extras | | 0 | (b - 0 w - 0, nb - 0, lb - 0) |
Total | | 104 | (18.5 Overs, 1 Wickets) |
Did not bat: | Ajinkya Rahane, Suresh Raina, MS Dhoni(c)(wk), Ravindra Jadeja, Ravichandran Ashwin, Bhuvneshwar Kumar, Mohit Sharma, Umesh Yadav |