రామానాయుడు 1936 జూన్ 6వ తేదిన ప్రకాశం జిల్లా కారంచేడు లో వెంకటేశ్వర్లు,లక్ష్మీ దేవమ్మ లకు జన్మించారు.వీరిది వ్యవసాయ కుటుంబం.చదువు మీద అంతగా ఆసక్తి చూపని రామానాయుడు మొదట్లో ఒంగోలు లో ఒక ఆసుపత్రిలో కంపౌండర్ గా పనిచేశారు.
తరువాత చదువుకోవడానికి మద్రాస్ వెళ్ళినా అక్కడా చదువు పూర్తి చేయక మళ్ళీ వచ్చి చీరాలలో చదువు పూర్తి చేసుకున్నాడు.పై చదువులు ఆపేసి పని చేయడం మొదలుపెట్టాడు.రైస్ మిల్,బస్ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారాలు చేసేవాడు మొదట్లో కారంచేడు లోనే.శంబు నిర్మాణ ఏజెన్సీ లో ఒక భాగస్వామిగా చేరిన రామానాయుడు నమ్మినబంటు చిత్రాన్ని చేశారు.ఆ తరువాత చాలా రోజులు ఈ నిర్మాణ సంస్థ ఏలాంటి సినిమాలు చేయలేదు.ఈ మధ్య కాలంలో కొన్ని చిత్రాల్లో నటించారు.
తరువాత పొగాకు పరిశ్రమ పెట్టాడు.అది నచ్చక మద్రాస్ కు వెళ్లి ఇటుకల వ్యాపారం చేశారు.అక్కడే అనురూప బ్యానర్ లో మిత్రుడితో కలిసి 'అనురాగం' అనే సినిమాను నిర్మించాడు.అది నష్టాలనే మిగిల్చింది.నష్టాలను పూడ్చుకునేందుకు మరిన్ని సినిమాలు నిర్మించాలని అనుకున్నాడు.
పెద్ద కొడుకు సురేష్ పుట్టాక సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి 1964 లో 'రాముడు-భీముడు' అనే చిత్రాన్ని నిర్మించారు.చాలా పెద్ద విజయాన్ని ఇచ్చింది ఆ సినిమా.
1968 లో విజయ సురేష్ కంబైన్స్ పేరుతొ నాగిరెడ్డి కుమారుడితో కలిసి పని చేసి నాలుగు చిత్రాలు నిర్మించినా అవి నష్టాలనే మిగిల్చాయి.తరువాత విడిపోయి 1971 లో 'ప్రేమ్ నగర్' చిత్రాన్ని నిర్మించారు రామానాయుడు.ఐతే ఈ సినిమా విజయం సాధించకుంటే కారంచేడు కు వెళ్లి వ్యాపారం చేసుకుంటాను అని నిర్ణయించుకున్నాడు.ఈ సినిమా ఆశించిన దానికంటే అతి పెద్ద విజయాన్ని ఇవ్వడంతో ఇక వెనుదిరిగి చూడలేదు రామానాయుడు గారు.
హైదరాబాద్ కు వచ్చి రామానాయుడు స్టూడియో ను నిర్మించారు.1988 లో కుమారుడు వెంకటేష్ తో నిర్మించిన 'బ్రహ్మపుత్రుడు' కమర్షియల్ గా పెద్ద హిట్ అవడంతో స్టూడియో కు తెచ్చిన అప్పులు తీర్చాడు.1989 లో రామానాయుడు స్టూడియో ను ప్రారంభించారు.1994 లో నానక్ రామ్ గూడా లో సినీ విలేజ్ నిర్మించారు.
రామానాయుడు సినీ ప్రస్థానంలో చాలా మందిని వెండి తెరకు పరిచయం చేశారు.దాదాపు 23మంది దర్శకులను,8 మంది సంగీత దర్శకులను,ఆరుగురు హీరోలను,12 మంది హీరోయిన్లను రామానాయుడు పరిచయం చేసిన వారిలో ఉన్నారు.
బాపట్ల నియోజకవర్గం నుండి టీడీపీ తరుపున మొదటిసారి ఎంపీగా 1999 లో ఎన్నికయ్యారు.
రామానాయుడు నిర్మాణ సారథ్యంలో వచ్చిన కొన్ని విజయవంతమైన చిత్రాలు :
రాముడు - భీముడు
ప్రేమ్ నగర్
జీవన తరంగాలు
చక్రవాకం
సోగ్గాడు
దేవత
అహ నా పెళ్ళంట
కలియుగు పాండవులు
ప్రేమ
ఇంద్రుడు చంద్రుడు
బొబ్బిలి రాజా
కూలీ నెం.1
ప్రేమ ఖైదీ
సూరిగాడు
పరువు ప్రతిష్ట
తాజ్ మహల్
ధర్మ చక్రం
ప్రేమించుకుందాం రా
గణేష్
శివయ్య
ప్రేయసి రావే
జయం మనదేరా
కలిసుందాం రా
ప్రేమించు
అల్లరి
నువ్వు లేక నేను లేను
మల్లీశ్వరి
తులసి
దృశ్యం
గోపాల గోపాల
అవార్డులు :
1973 లో నిర్మించిన జీవన తరంగాలు చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్ అవార్డు.
1976 లో నిర్మించిన సోగ్గాడు చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్ అవార్డు.
1996 లో తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం.
1999 లో బెంగాలీ లో నిర్మించిన అసుఖ్ చిత్రానికి జాతీయ అవార్డు.
2000 లో లైఫ్ టైం అచీవ్ మెంట్(సౌత్) అవార్డు.
2001-02 కు గాను ప్రేమించు చిత్రానికి ఐదు నంది అవార్డులు సొంతం.
2003 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు.
2009 లో రాష్ట్రపతి చేతులమీదుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.
2013 సంవత్సరానికి గాను పద్మభూషణ్ అవార్డు.
రామానాయుడు లేని లోటు తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమాకే లోటు.
No comments:
Post a Comment