ఇంగ్లాండ్ తో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో న్యూజీలాండ్ బ్యాట్స్ మ్యాన్ బ్రెండన్ మెక్ కల్లమ్ చెలరేగాడు.కేవలం 18 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ లో తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
కేవలం 18 బంతుల్లోనే 7 ఫోర్లు,నాలుగు సిక్సుల సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక మరింత చెలరేగాడు మెక్ కల్లమ్.
చివరికి 25 బంతులు ఆడి 7 ఫోర్లు,7 సిక్సుల సహాయంతో 75 పరుగులు చేసి వెనుదిరిగాడు.అంతే కాకుండా ఒక జట్టు ప్రపంచకప్ లో 100 పరుగులను 6.4 ఓవర్లలో చేరుకోవడం ఇదే మొదటిసారి.
అంతకముందు ఇంగ్లాండ్ 123 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
ప్రపంచకప్ లో 20 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన తన రికార్డునే మెక్ కల్లమ్ తిరగరాశాడు.
No comments:
Post a Comment