ప్రపంచకప్ క్రికెట్ లో భాగంగా హామిల్టన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది జింబాబ్వే.
హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగితున్న దక్షిణాఫ్రికా ను ఓడించడం జింబాబ్వే కు ఒకింత కష్టమే అని చెప్పవచ్చు.కాకుంటే క్రికెట్ లో ఏదైనా సంభవించోచ్చు.
ప్రపంచకప్ అంటేనే దక్షిణాఫ్రికాకు కలిసి రాదు,అనే నానుడి ఈసారైనా తుడిపేయాలని చూస్తుంది సఫారి జట్టు.
1999 ప్రపంచకప్ ను పునరావృత్తం చేయాలని జింబాబ్వే చూస్తుంది.1999 ప్రపంచకప్ క్రికెట్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసి 233 పరుగులు చేస్తే,దక్షిణాఫ్రికా 185 పరుగులకే కుప్పకూలింది.ఐతే ఈసారి ఏమైతుందో చూడాలి.
No comments:
Post a Comment