మూవీ మొఘల్, శతాధిక చిత్రాల నిర్మాత డి.రామానాయుడు(78) బుధవారం కన్నుమూశారు.కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో భాదపడుతూ హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు.
రూపాయి నోటు మీద ఉన్న అన్ని బాషల్లో సినిమాలు నిర్మించిన ఘనత దగ్గుబాటి రామానాయుడు సొంతం.అత్యధిక సినిమాలు నిర్మించినందుకు గాను రామానాయుడు గిన్నీస్ బుక్ లో కూడా స్థానం సంపాదించాడు.
రామానాయుడు కు భార్య,ఇద్దరు కొడుకులు,ఒక కూతురు ఉన్నారు.రామానాయుడు మృతికి చంద్రబాబు,కెసిఆర్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు,నాయకులు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.
రామానాయుడు కు భార్య,ఇద్దరు కొడుకులు,ఒక కూతురు ఉన్నారు.రామానాయుడు మృతికి చంద్రబాబు,కెసిఆర్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు,నాయకులు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.
రామానాయుడు 1936 జూన్ 6వ తేదిన ప్రకాశం జిల్లా కారంచేడు లో వెంకటేశ్వర్లు,లక్ష్మీ దేవమ్మ లకు జన్మించారు.వీరిది వ్యవసాయ కుటుంబం.చదువు మీద అంతగా ఆసక్తి చూపని రామానాయుడు మొదట్లో ఒంగోలు లో ఒక ఆసుపత్రిలో కంపౌండర్ గా పనిచేశారు.
బుధవారం మధ్యాహ్నం 2:30కు చనిపోయారు,గురువారం ఉదయం 9 గంటల నుండి అభిమానుల సందర్శనార్థం రామానాయుడు స్టూడియో లో పార్థీవ దేహాన్ని ఉంచుతామని,సాయంత్రం 3 తరువాత అంత్యక్రియలకు క్రియలు నిర్వహిస్తామని చిన్న కుమారుడు,నటుడు వెంకటేష్ తెలిపారు.
No comments:
Post a Comment