బిహార్ రాజకీయాల్లో రోజుకో నాటకీయపరిణామం చోటుచేసుకుంటుంది.బీహార్ ముఖ్యమంత్రి,జేడీయు బహిష్కృత నేత జీతన్ రామ్ మాంఝీ గవర్నర్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.అసెంబ్లీని రద్దు చేయాలని కోరారు.ఈ విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు దృవీకరించాయి.
బలప్రదర్శనకు ముందే జితన్ రామ్ రాజీనామా చేయడంతో జేడీయు ఎమ్మెల్ల్యేలు సంబరాలు చేసుకున్నారు.స్పీకర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించలేదు.జేడీయు కు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు,నితీశ్ కుమార్ ఎమ్మెల్యేలను బెదిరించారు అందుకే రహస్య ఓటింగ్ కోరాను అని జితన్ రామ్ అన్నారు.
బీహార్ అసెంబ్లీ లో మొత్తం 243 స్థానాలకు గాను ప్రస్తుతం 233 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.వీరిలో జేడీయు కు 110 మంది,బీజేపీ కి 87,ఆర్జేడీ కి 24,కాంగ్రేస్ కు 5, సీపీఐ 1,స్వతంత్రులు 5 మరియు మాంఝీ ఉన్నారు.
ఆర్జేడీ,కాంగ్రేస్ లు నితీశ్ కుమార్ ఆర్జేడీ కి మద్దతు ఇస్తున్నారు.
మాంఝీ రాజీనామా చేయడంతో నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పీఠం ఎక్కే అవకాశాలు మెరుగయ్యాయి.
No comments:
Post a Comment