ప్రపంచకప్ క్రికెట్ లో భాగంగా క్రైస్ట్ చర్చ్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో మునిగింది.
వెస్టిండీస్ విధించిన 311 లక్ష్య చేధనలో విండీస్ బౌలర్ల ధాటికి 4 ఓవర్లలో ఒక్క పరుగు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది.మొదటి ఓవర్ వేసిన టేలర్ ఒక్క పరుగు ఇచ్చి 2 వికెట్లు తీస్తే మూడో ఓవర్లో మరో వికెట్ తీసుకున్నాడు.ఈ మూడు వికెట్లు డకౌట్ లే.ఈ ముగ్గురిలో నసీర్ జంషెడ్,యూనిస్ ఖాన్,హారిస్ సోహైల్ ఉన్నారు.మరో పక్క ఇన్నింగ్స్ మూడో ఓవర్లో హోల్డర్,అహ్మద్ షెహజాద్(1) వికెట్ ను తీసుకున్నాడు.
అంతకముందు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్.గేల్ మరోసారి విఫలమై కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు.చివరి వరకు ఆచి తూచి ఆడిన వెస్టిండీస్ చివరి 5 ఓవర్లు బ్యాట్ జులిపించింది.ముఖ్యంగా చివర్లో వచ్చిన రస్సెల్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.కేవలం 13 బంతుల్లో 3 ఫోర్లు,4 సిక్సుల సహాయంతో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాకుండా 300 కూడా దాటదనుకున్న స్కోరు ను 310 కి చేర్చాడు.
హరిస్ సోహైల్ 2 వికెట్లు తీసుకున్నాడు.
No comments:
Post a Comment