తెలంగాణాలో సెటిలర్ అనే పదం ఇక నుండి ఉండదని సీఎం కెసిఆర్ అన్నారు.నేను కూడా మెదక్ లో పుట్టి హైదరాబాద్ లో లే ఉంటున్నాను.ఆంధ్ర నుంచి మీ తాతలు,తండ్రులు ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి మీరు కూడా హైదరాబాదీ లే అనే హైదరాబాద్ లో కూకట్ పల్లి కి చెందిన 1000 మంది తెరాస లో చేరిన సందర్భంగా ఈ వ్యాక్యాలు చేశారు కెసిఆర్.
హైదరబాద్ లో ఉన్నవాళ్ళంతా తెలంగాణా వారే,ఇక్కడ స్థిర పడిన వారికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా, హైదరాబాద్ లో స్థిరపడ్డ వారందరితో త్వరలోనే సమావేశం నిర్వహిస్తాను అని అన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్.
తెలంగాణా ప్రభుత్వానికి ప్రాంతీయ బేధం ఉండదు,అందుకే రామానాయుడు గారి అంత్యక్రియలు ప్రభుత్వం అధికార లాంచనాలతో నిర్వహిస్తున్నామని, ఉద్యమంలో కొన్నిసార్లు తేడాలు చూపించాల్సి వచ్చింది అని తెలిపారు కెసిఆర్.
No comments:
Post a Comment