Radio LIVE


Breaking News

Saturday, 13 September 2014

ప్రముఖులకు గీతం స్నాతకోత్సవంలో డాక్టరేట్ల ప్రధానం

ఘనంగా గీతం యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర సలహాదారు,రక్షణ పరిశోధనాభివృద్ధి విభాగం కార్యదర్శి డాక్టర్ అవినాశ్ చందర్,దర్శకుడు రాఘవేంద్రరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి శైలజా కిరణ్,ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.
వీరికి గీతం ఛాన్సలర్ డాక్టర్ కోనేరు రామకృష్ణ రావు డాక్టరేట్లను ప్రధానం చేశారు.
అవినాశ్ చందర్ అనంతరం మాట్లాడుతూ భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచమేటి శక్తిగా ఎదుగుతుందని ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాలు దేశానికి ఉపయోగపడే పరిశోధనలకు కేంద్రాలు కావాలని పిలుపునిచ్చారు.
Read more ...

18 సంవత్సరాల తరువాత ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో స్వీప్ చేసిన ఎబీవీపి

బీజేపీ విద్యార్థి విభాగం ఎబీవీపి(భారతీయ విద్యార్థి పరిషత్) 18 సంవత్సరాల తరువాత ఢిల్లీ యూనివర్సిటీ యూనియన్ ఎన్నికల్లో స్వీప్ చేసింది. కాంగ్రేస్ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యూ ఐ ని మట్టికరిపించి నాలుగింటికి నాలుగు స్థానాలు దక్కించుకొని సత్తా చాటింది.
ఎబీవీపి ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్,సెక్రటరీ మరియు జాయింట్ సెక్రటరీ స్థానాలను స్పష్టమైన మెజారిటీతో కైవసం చేసుకుంది.మోహిత్ నగర్ ప్రెసిడెంట్ గా,ప్రవేష్ మాలిక్ వైస్ ప్రెసిడెంట్ గా,ఖనిక షెఖావత్ సెక్రటరీగా,అషుతోష్ మాథుర్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
ఎన్నికల్లో విజయం సాధించిన ఎబీవీపి విద్యార్థి విభాగాన్ని బీజేపే జాతీయ అధ్యక్షుడు ట్విట్టర్ లో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read more ...

Friday, 12 September 2014

ప్రశాంతంగా కొనసాగుతున్న మెదక్,నందిగామ ఉపఎన్నికల పోలింగ్

తెలంగాణాలోని మెదక్ లోక్ సభ స్థానానికి,ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుతున్న ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.
మెదక్ ఉపఎన్నిక కోసం 1817 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పోలింగ్ మందకోడిగా కొనసాగుతుంది.పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదని గంగాపూర్ గ్రామస్థులు,రోడ్డు సౌకర్యం లేదని పెద్దాపూర్ గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు.మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఓటు వేయగా తెరాస అభ్యర్థి కొత్తా ప్రభాకర్ రెడ్డి పోచారంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి సంగారెడ్డిలో కాంగ్రేస్ అభ్యర్థి సునితా లక్ష్మారెడ్డి గోమారంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.దాదాపు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.
కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీకి జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ కూడా చాల మందకోడిగా సాగుతుంది.మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.టీడీపీ అభ్యర్థి సౌమ్య నందిగామలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ 16న జరుగుతుంది
Read more ...

భార్య మీద కోపంతో దాన్నే కోసేసుకున్న బీహార్ వాసి !

ఆవేశంలో కొంత మంది ఎం చేస్తారో వారికే తెలియదు.కొందరు కొందరు కత్తిత్తో కోసుకోవడం,కొందరు నిప్పంటించుకోవడం మరికొందరు ఇతరుల మీద దాడులు చేస్తుంటారు.కాని బీహార్ కు చెందిన ఒక వ్యక్తి తీవ్ర ఆవేశంతో తన పురుశాంగాన్నే కోసేసుకున్నాడు.
బీహార్ రాష్ట్రంలోని సివన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం భాదితుడు ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తుంటాడు.నెలరోజులు సెలవుపెట్టి సొంతూరికి చేరుకున్నాడు.ఇతనికి ఇద్దరు కూతుర్లు.మగ బిడ్డ లేడని ఇద్దరి దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.గురువారం కూడా ఇదే విషయమై తీవ్ర స్థాయిలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.అంతే కోపం ఆపుకోలేక అతడు పదునైన కత్తితో తన పురుషాంగాన్ని కోసుకున్నాడు అని అతని బంధువులు చెప్పారు.
అతని వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని,తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు.అతని ఆరోగ్యం గురించి ఇంకా డాక్టర్లు ఏమీ చెప్పలేదని పోలీసులు అన్నారు.
Read more ...

దసరాకు రానున్న 'రుద్రమదేవి' మొదటి టీజర్ ?

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'.3D స్టీరియో స్కోపిక్ చిత్రంగా తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
దసరా కానుకగా ఈ చిత్ర మొదటి టీజర్ విడుదల చేసే యోచనలో డైరెక్టర్ గుణశేఖర్ ఉన్నట్టు తెలుస్తుంది.ఇటీవలే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుకుంటుంది.సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
చిత్రంలో చాళుక్య వీరభద్రగా రాణా,గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ కనిపించనున్నారు.
Read more ...

ఛాంపియన్స్ లీగ్ టీ20 క్రికెట్ సెప్టెంబర్ 13నుండి - షెడ్యూల్

ఛాంపియన్స్ లీగ్ 6వ ఎడిషన్ సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 3 వరకు జరగనుంది.ఈసారి ఛాంపియన్స్ లీగ్ ఇండియా లోనే నిర్వహిస్తుండగా ఐపీఎల్ 7 ఫైనల్ జరిగిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఇది వరకు నిర్వహించిన ఫార్మాట్ లోనే ఈసారి టోర్నీ నిర్వహించనున్నారు.మొత్తం పది టీమ్ లు పాల్గొనే ఈ టోర్నీలో రెండు గ్రూపులు ఉంటాయి.ఒక్కో గ్రూపులో 5 జట్లు ఉంటాయి.
గ్రూప్ 'ఏ' - ఐపీఎల్-7 విజేత కోల్ కతా తో పాటు,చెన్నై సూపర్ కింగ్స్,డాల్ఫిన్స్(దక్షిణాఫ్రికా),పెర్త్ స్కార్చర్స్(ఆస్ట్రేలియా) మరొకటి క్వాలిఫైయర్ లో విజయం సాధించిన జట్టు.
గ్రూప్ 'బి' - కింగ్స్ ఎలెవన్ పంజాబ్,కేప్ కోబ్రాస్(సౌత్ఆఫ్రికా),హోబార్ట్ హరికేన్స్(ఆస్ట్రేలియా),వెస్టిండీస్ దేశీయ టీ20 విజేత మరియు క్వాలిఫైయర్ లో విజయం సాధించిన రెండో జట్టు.
క్వాలిఫైయర్ మ్యాచ్ లో సెప్టెంబర్ 13 నుండి 16 వరకు నిర్వహిస్తారు.ముంబై ఇండియన్స్,నార్తర్న్ నైట్స్(న్యూజిలాండ్),సథరన్ ఎక్స్ ప్రెస్(శ్రీలంక)మరియు లాహోర్ లయన్స్(పాకిస్థాన్)క్వాలిఫైయర్ లో పోటీ పడనున్నాయి.ఇందులో నుండి రెండు జట్లు గ్రూప్ లెవెల్ కి చేరుకుంటాయి.
గ్రూప్ మ్యాచ్ లు హైదరాబాద్,రాయ్ పూర్,మొహాలి,బెంగళూరు లో జరగనున్నాయి.ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది.విజేతకు 6మిలియన్ డాలర్లు చెల్లించనున్నారు.
మొదటి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్,చెన్నై సూపర్ కింగ్స్ తలబడనున్నాయి.
Schedule
DateMatch DetailsTimeVenue
ISTCity
Sep 13 - SatNorthern Knights v Southern Express,Qualifying Group16:00Raipur
Sep 13 - SatMumbai v Lahore Lions,Qualifying Group20:00Raipur
Sep 14 - SunNorthern Knights v Lahore Lions,Qualifying Group16:00Raipur
Sep 14 - SunMumbai v Southern Express,Qualifying Group20:00Raipur
Sep 16 - TueSouthern Express v Lahore Lions,Qualifying Group16:00Raipur
Sep 16 - TueMumbai v Northern Knights,Qualifying Group20:00Raipur
Sep 17 - WedKolkata v Chennai, Group A20:00Hyderabad
Sep 18 - ThuPunjab v Hobart Hurricanes,Group B20:00Mohali
Sep 19 - FriCape Cobras v TBC,Group B20:00Raipur
Sep 20 - SatDolphins v Perth Scorchers,Group A16:00Mohali
Sep 20 - SatBarbados Tridents v Punjab,Group B20:00Mohali
Sep 21 - SunCape Cobras v Hobart Hurricanes,Group B16:00Hyderabad
Sep 21 - SunKolkata v TBC,Group A20:00Hyderabad
Sep 22 - MonDolphins v Chennai,Group A20:00Bengaluru
Sep 23 - TueHobart Hurricanes v TBC,Group B20:00Raipur
Sep 24 - WedKolkata v Perth Scorchers,Group A20:00Hyderabad
Sep 25 - ThuChennai v TBC,Group A20:00Bengaluru
Sep 26 - FriBarbados Tridents v Cape Cobras,Group B16:00Mohali
Sep 26 - FriPunjab v TBC,Group B20:00Mohali
Sep 27 - SatDolphins v TBC,Group A16:00Bengaluru
Sep 27 - SatPerth Scorchers v Chennai,Group A20:00Bengaluru
Sep 28 - SunBarbados Tridents v Hobart Hurricanes,Group B16:00Mohali
Sep 28 - SunPunjab v Cape Cobras,Group B20:00Mohali
Sep 29 - MonKolkata v Dolphins,Group A20:00Hyderabad
Sep 30 - TuePerth Scorchers v TBC,Group A16:00Bengaluru
Sep 30 - TueBarbados Tridents v TBC,Group B20:00Bengaluru
Oct 02 - ThuTBC v TBC, Semi Final 116:00Hyderabad
Oct 02 - ThuTBC v TBC, Semi Final 220:00Hyderabad
Oct 04 - SatTBC v TBC, Final20:00Bengaluru
Read more ...

హర్యానా,మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

చీఫ్ ఎలక్షన్ కమిషన్ హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ ప్రకటించింది.ఈ సందర్భంగా సీఈసీ సంపత్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈనెల 27ను నోటిఫికేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదిగా నిర్ణయించినట్లు తెలిపారు.మహారాష్ట్ర లో 288 MLA స్థానాలకు,హర్యానాలో 90 MLA స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ కానుంది.ఓటర్ లకు అసెంబ్లీ ఎన్నికల్లో నోటా సౌకర్యం ఉంటుందని స్పష్టం చేశారు.అక్టోబర్ 15న పోలింగ్, 19 న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
Read more ...

ఆవేశంలో ---- కోసేసుకున్న బీహార్ వాసి !

ఆవేశంలో కొంత మంది ఎం చేస్తారో వారికే తెలియదు.కొందరు కొందరు కత్తిత్తో కోసుకోవడం,కొందరు నిప్పంటించుకోవడం మరికొందరు ఇతరుల మీద దాడులు చేస్తుంటారు.కాని బీహార్ కు చెందిన ఒక వ్యక్తి తీవ్ర ఆవేశంతో తన పురుశాంగాన్నే కోసేసుకున్నాడు.
బీహార్ రాష్ట్రంలోని సివన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం భాదితుడు ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తుంటాడు.నెలరోజులు సెలవుపెట్టి సొంతూరికి చేరుకున్నాడు.ఇతనికి ఇద్దరు కూతుర్లు.మగ బిడ్డ లేడని ఇద్దరి దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.గురువారం కూడా ఇదే విషయమై తీవ్ర స్థాయిలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.అంతే కోపం ఆపుకోలేక అతడు పదునైన కత్తితో తన పురుషాంగాన్ని కోసుకున్నాడు అని అతని బంధువులు చెప్పారు.
అతని వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని,తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు.అతని ఆరోగ్యం గురించి ఇంకా డాక్టర్లు ఏమీ చెప్పలేదని పోలీసులు అన్నారు.
Read more ...

రవితేజ సినిమా 'పవర్' రివ్యూ..!

'బలుపు' సినిమా విజయం తరువాత సంవత్సరం పైగా గ్యాప్ తరువాత మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం 'పవర్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గతంలో డాన్ శీను,మిస్టర్ ఫర్‌ఫెక్ట్,బలుపు చిత్రాల ద్వారా కథారచయితగా మంచి పేరు తెచ్చుకున్న బాబీ(కే ఎస్ రవీంద్ర) ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.రాక్ లైన్ ఎంటర్ టైనమెంట్ నిర్మాణసారథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా హన్సిక,రెజీనా కథానాయికలుగా నటించారు.
'పవర్' మీద భారీ ఆశలు పెట్టుకున్న రవితేజ,సినిమాలో పవర్ చూపించాడా? అసలు సినిమాలో పవర్ ఉందా...? లేదా..? చూద్దాం
కోల్ కతాలో అవినీతి పోలీస్ ఆఫీసర్ ఏసీపీ బలదేవ్ సహాయ్(రవితేజ).హోంమంత్రి జయవర్ధనే(ముఖేశ్ రుషి)సోదరుడు గంగూలీ భాయ్(సంపత్)ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్తుండగా బలదేవ్ సహాయ్ అతన్ని కోర్టులో ప్రవేశపెట్టకుండా పోలీసుల నుండి తప్పించి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాడు.ఇక్కడ కట్ చేస్తే.....
హైదరాబాద్ లో పోలీస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో తిరుపతి(రవితేజ) అనే కుర్రాడు చేయని ప్రయత్నాలు లేవు,కాని అన్నీ విఫలం అవుతాయి.అనుకోకుండా హోంమంత్రి జయవర్ధనే తిరుపతిని చూసి అతనితో మాట్లాడి ఏసీపీ బలదేవ్ సహాయ్ స్థానంలో కూర్చోబెడతాడు.కాని తిరుపతి అలియాస్ బలదేవ్ సహాయ్ జయవర్ధనేకు ఎదురు తిరుగుతాడు.అసలు తిరుపతి ఎందుకు ఎదురుతిరుగుతాడు?బలదేవ్ సహాయ్ నిజంగా అవినీతి ఆఫీసరా?అసలు గంగూ భాయ్ ఎవరు?ఇద్దరు హీరోయిన్లు తిరుపతికి ఎలా సహాయపడతారు వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్లు
రవితేజ ఎనర్జీ సినిమాకు అదనపు బలం.తిరుపతి,బలదేవ్ సహాయ్ రెండు పాత్రల్లో రవితేజ కనిపించారు.హాస్యాన్ని అందించడంలో రవితేజ మరోసారి తనమార్కు ఏంటో చూపించాడు.హాస్యంతో పాటు యాక్షన్ సన్నివేశాలు బాగా చేశాడు హీరో.సినిమాలో హీరోయిన్ల పాత్రలకు అంతగా ప్రాధాన్యం లేనప్పటికీ ఇద్దరూ బాగానే నటించారు.ఫ్లాష్ బ్యాక్ లో కనిపించిన రెజీనా గ్లామర్ గా కనిపించింది.ఒక సాంగ్ లో లిప్ కిస్ తోపాటు గ్లామర్ డోస్ పెంచింది రెజీనా.హన్సిక 4 పాటలకు పరిమితమైంది అని చెప్పవచ్చు.ఆణిముత్యం పాత్రలో బ్రహ్మానందం సందడి చేశాడు.కనిపించినంత సేపు నవ్వించాడు.సప్తగిరి కనిపించింది కొంతసేపే అయిన పాత్రకు న్యాయం చేసి నవ్వులు పండించాడు.జయనన్ విన్సెంట్‌తో కలిసి ఆర్థర్ విల్సన్ ఫోటో గ్రఫీ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం బాగుంటుంది.
మైనస్ పాయింట్లు
దర్శకుడిగా మారిన బాబి సాహసం చేయకుండా రోటీన్ గానే సినిమా తీశాడు.ఒకవిధంగా కథను నడిపించడంలో కన్ఫ్యూజ్ అయ్యాడు.అనుకున్నట్టు కథను ప్రెసెంట్ చేయలేకపోయాడు.స్టొరీ లైన్ విషయానికి వస్తే 'ఆపరేషన్ దుర్యోధన' సినిమా గుర్తుకొస్తుంది.టేకింగ్ పరంగా చూస్తే 'విక్రమార్కుడు',చిత్రంలో సన్నివేశాలు కొన్ని 'బలుపు' చిత్రాన్ని పోలి ఉంటాయి.క్లైమాక్స్ లుంగీ డాన్స్ సీక్వెన్స్ అంతగా ఆకట్టుకోదు.తమన్ సంగీతం యావరేజ్ అని చెప్పొచ్చు.సెకండ్ ఆఫ్ లో కామెడీ కనిపించదు.
తీర్పు
చాలా రోజుల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ 'పవర్' అంత పవర్ చూపించలేదు.రొటీన్ చిత్రమే అయినప్పటికే ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.అందులో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.మూస దొరణిని పక్కకు పెడితే ఇంకొంచం కొత్తగా కనిపించేది దర్శకుడి ప్రతిభ.రవితేజ అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తారు.కాని మిగతావారు సెకండ్ ఆఫ్ కు వచ్చే సరికి కొంత ఇబ్బంది పడొచ్చు.ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సినిమాలు లేకపోవడం పవర్ కు ప్లస్.మొదటి వారం కలెక్షన్లు రాబట్టడంలో సఫలం అవుతుంది సినిమా.
రేడియో జల్సా.కామ్ రేటింగ్ :: 3.25/5
Read more ...

Thursday, 11 September 2014

విక్రం 'ఐ' మోషన్ పోస్టర్ విడుదల ... వీడియో వీక్షించండి

గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న శంకర్,విక్రం ల ప్రతిష్టాత్మక చిత్రం 'ఐ',తెలుగులో 'మనోహరుడు'గా వస్తుంది.గురువారం ఈ చిత్ర మొదటి motion పోస్టర్ ను విడుదల చేశారు.ఈ నెల 15న ఈ చిత్ర ఆడియో విడుదలను భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ శ్వార్జ్ నెగ్గర్,సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు చాలామంది ప్రముఖులు హాజరుకానున్నారు.
ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.విక్రం సరసన అమీ జాక్సన్ కథానాయికగా కనిపించనుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకునే పనిలో ఉండి చిత్రం.ఆడియో విడుదల రోజే చిత్ర టీజర్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
Read more ...

ఆంజనేయ స్వామికి ఆధార్ కార్డుంది,మరి మీకు...?

మనుషులకే కాదు దేవుళ్ళకూ ఆధార్ కార్డులు వస్తున్నాయి.అవును మీరు చదివింది నిజమే.రాజస్థాన్ లో ఆంజనేయ స్వామికి ఆధార్ కార్డు జారీ చేశారు.స్వయంగా హనుమంతుడే వచ్చి ఫోటోతో పాటు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారా!ఆధార్ కేంద్రంలోకి వెళ్లి నమోదు చేసుకుంటే తప్ప రాని 12 సంఖ్యల ఆధార్ కార్డు దేవుడి పేరుమీద ఎలా వచ్చింది.ఆధార్ కార్డు జారీ ప్రక్రియకూడా పారదర్శకంగా జరగడం లేదా అనే అనుమానం కలుగుతుంది.దేశంలో ప్రతీ ఒక్కరికి ఒక ప్రత్యేక సంఖ్య ఉండాలని,ప్రభుత్వ పథకాల్లో ఆధార్ కార్డును ప్రామాణికంగా ఉపయోగించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.
కార్డు మీద ఉన్న వివరాల ప్రకారం 'హనుమాన్ జి' అనే పేరు మీద కార్డు జారీ అయింది.తండ్రి పేరు 'పవన్ జి',పుట్టిన రోజు 01/01/1959,పురుష లింగం.
వివరాలు పరిశీలిస్తే రాజస్థాన్ లోని సీకర్ జిల్లా పోస్టాఫీసుకు నాలుగు రోజుల క్రితం ఈ ఆధార్ కార్డు వచ్చింది.కార్డు మీద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా తప్పుడు నకిలీ కార్డు అని అధికారులు గుర్తించారు.
విక్కీ కుమార్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ఆధార్ కార్డు కోసం 4 సార్లు దరఖాస్తు చేసుకున్నాడట,కాని అతని ఫింగర్ ప్రింట్స్ కంప్యూటర్ ఆమోదించలేదు,కాబట్టి హనుమంతుడి పేరు మీద దరఖాస్తు చేసి తన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాడట...ఈసారి మాత్రం ఆధార్ కార్డు వచ్చింది.కాని కార్డు తీసుకోవడానికి సదరు దరఖాస్తుదారుడు నిరాకరిస్తున్నాడు.
అడ్రస్ గుర్తించడానికే నాలుగురోజులు పట్టిందని,కార్డు తీసుకోవడానికి అతను నిరాకరిస్తున్నాడు,కాబట్టి కార్డును తిరిగి వెనకకు పంపిస్తున్నాము అని పోస్టల్ అధికారి భోగ్ రాజ్ చెప్పారు.
Read more ...

Wednesday, 10 September 2014

పద్మ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానించిన కేంద్రం

2015 సంవత్సరానికిగాను పద్మ పురస్కారాల కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.వివిధ రంగాల్లో నిష్ణాతులకు ఇచ్చే పద్మ అవార్డుల కోసం సెప్టెంబర్ 15వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.
దరఖాస్తు చేసుకోదలచిన వారు దరఖాస్తు ఫారాలను నేరుగా కేంద్ర హోంమంత్రి లేదా కేంద్ర హోం సెక్రెటరీ లకు న్యూఢిల్లీ లోని నార్త్ బ్లాక్ లో ఉన్న వారి కార్యాలయాల్లో అందజేయవచ్చు.దరఖాస్తు నమూనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో లభిస్తుంది.
వెబ్ సైట్ : http://mha.nic.in/sites/upload_files/mha/files/Proforma-Englis hRevised-050514.pdf
రెండు పేజీలకు మించకుండా నిర్ణీత నమూనాలో దరఖాస్తు నింపి 800 పదాలకు మించకుండా తమగురించి దరఖాస్తులో పొండుపరచాల్సి ఉంటుంది.
Read more ...

ఈ వారం కవిత .... జీవితం ఒక సమరం

మీరు కూడా మీ కవితలు మాకు పంపించండి,మేము ప్రమోట్ చేస్తాము. కవితలు క్రింది మెయిల్ అడ్రస్ కు పంపించండి.

 radiojalsa.com@gmail.com లేదా contact@radiojalsa.com

Read more ...

జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు రూ.10లక్షలు విరాళం ప్రకటించిన విజయ్ కాంత్

60 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ లో వరదలు సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు.పల్లెలతో పాటు పట్టణాలు వరదలకు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి.అనేక మంది నిరాశ్రెయులయ్యారు.ఇప్పటికే కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించింది.
వీరిని ఆదుకోవడానికి అనేకమంది తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు.తమిళనాడుకు చెందిన DMDK అధినేత విజయ్ కాంత్ తనవంతుగా రూ.10 లక్షల విరాళాన్ని కాశ్మీర్ వరద బాధితులకు ఇస్తున్నట్టు ప్రకటించారు.వరదల్లో మృతి చెందిన వారికి,వారి బంధువులకు తన పార్టీ తరపున సంతాపాన్ని ప్రకటించారు.దేశంలో వ్యాపారవేత్తలు,ధనికులు,ఉద్యోగులు తమవంతు సహకారాన్ని కాశ్మీర్ వరద భాదితులకు అందించాలని ఈ సందర్భంగా కోరారు.
గత సంవత్సరం ఉత్తరాఖండ్ లో వరదలు ప్రళయాన్ని సృష్టించినప్పుడు కూడా విజయ్ కాంత్ రూ.10 లక్షల సహాయాన్ని అందించారు.
Read more ...

నేడు ఆఫ్ఘానిస్థాన్ కు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్

అధికారిక పర్యటన కోసం భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం ఆఫ్ఘానిస్థాన్ లోని కాబుల్ వెళ్లనున్నారు.భారత్ కు వ్యూహాత్మకంగా ఎంతో కీలక భాగస్వామిగా ఉన్న ఆఫ్ఘానిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్యంగా ఆమె పర్యటన చేపట్టారు.ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు కర్జాయ్ తో సుష్మా సమావేశం అవుతారు.
Read more ...

ప్రతి ఇంటికి నీరివ్వడమే వాటర్ గ్రిడ్ లక్ష్యం - కెసిఆర్

తెలంగాణాలోని ప్రతి ఇంటికి నీరివ్వడమే వాటర్ గ్రిడ్ లక్ష్యమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఈరోజు వాటర్ గిడ్ పై గ్రామీణ ప్రాంత ఇంజనీర్లతో ఆచార్య జయశంకర్ వర్సిటీలో సిఎం కేసిఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎం ప్రసంగిస్తూ ప్రతి ఇంటిపై నళ్లా,మరుగుదొడ్డి ఏర్పాటుపై అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సమగ్ర మంచినీటి పథకాన్ని సిద్దిపేటలో అభివృద్ధి చేశామని అన్నారు.రాష్ట్రంలో మంచినీరు అందించే విషయంలో అధికారులు ముఖ్యపాత్ర పోషించాలనిఅలాగే వేల కోట్లు వెచ్చించిన కార్యక్రమం దుర్వినియోగం కాకూడదని అధికారులను నిర్ధేశిస్తూ కింది స్థాయి ఉద్యోగులను అవగాహన పరిచి పథకం సద్వినియోగం చేయాలని సూచించారు.డబ్బు వెచ్చించడం వరకే ప్రభుత్వం పని.ఆ డబ్బును సద్వినియోగం చేయాల్సింది అధికారులేనని.అందరూ కలిసి సహకరించుకొని పని చేస్తేనే ప్రభుత్వ పథకాలు సద్వినియోగం అవుతాయని సిఎం అన్నారు.
Read more ...

తవ్వకాల్లో బయటపడ్డ 232 క్యారెట్ల అరుదైన వజ్రం!

దక్షిణాఫ్రికా లోని జోహనెస్ బర్గ్ వద్ద జరుగుతున్న తవ్వకాల్లో ఆద్భుతమైన,నమ్మశక్యం కాని 232.08 క్యారెట్ల వజ్రం
బయటపడింది.దీని విలువ సుమారు రూ.80 కోట్లు ఉంటుందని అంచనా.ఇది అసాధారణమైన పరిమాణంలో ఉండి అత్యంత స్పష్టత కలిగి ఉంది ఈ వజ్రం.
దక్షిణాఫ్రికాలోని కలినన్ గనిలో పేట్రా డైమండ్స్ జరుపుతున్న తవ్వకాలో ఈ D-కలర్ టైప్ 2 వజ్రం బయటపడింది.
ఈ D-కలర్ టైప్ 2 వజ్రాలు చాలా కాలం క్రితం ఏర్పడ్డాయి.ఇవి చూడడానికి చాలా పెద్దవిగా,ఒక ఆకారం అంటూ లేకుండా ఉంటాయి మరియు కొలవదగిన నత్రజని మలినాలు ఏమి ఉండవు.కాబట్టి రంగు మరియు నాణ్యత విషయంలో వీటికి సాటేవిలేవు.అందుకే ఈ వజ్రాలకు చాల విలువ ఉంటుంది.
1905 సంవత్సరంలో ఇదే గనిలో 3,106 క్యారెట్ల వజ్రం తవ్వకాల్లో బయటపడిందట.
Read more ...

Tuesday, 9 September 2014

ప్రాణం తీసిన ఇడ్లీ

కేరళలోని పాలక్కాడ్ లో ఓనం పండుగ సందర్భంగా సరదాగా ఓ పోటిలో పాల్గొంటే అది అతని ప్రాణాలనే
హరించింది.పండగ సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తక్కువ సమయంలో ఎక్కువ ఇడ్లీలు తినే పోటీ నిర్వహించారు.కుందముత్తన్ అనే వ్యక్తి పోటీలో గెలవాలనే ఆత్రుతతో గబగబా ఇడ్లీలను తినబోగా అవి అతని గొంతుకు అడ్డుపడ్డాయి.దీంతో కుందముత్తన్ ఊపిరాడక మృతిచెందాడని పోలీసులు తెలిపారు.ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు.
Read more ...

భారత్ మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నిట్రో - ధర రూ.12,990


మొబైల్ ఫోన్ల విక్రయాల్లో సామ్ సంగ్ దూకుడుకు కళ్ళెం వేస్తూ 16.6 శాతం మార్కెట్ షేర్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే.కాన్సాస్ స్మార్ట్ ఫోన్లతో మరింత దూసుకెళ్తున్న మైక్రోమ్యాక్స్,తన తదుపరి కాన్వాస్ సీరీస్ అయిన 'కాన్వాస్ నిట్రో'ను భారత్ మార్కెట్ లోకి విడుదల చేసింది.దీని ధరను రూ.12,990 గా నిర్ణయించారు.స్నాప్ డీల్ ద్వారా మైక్రో మ్యాక్స్ నిట్రోను ఆన్ లైన్ లో కొనుగోలుచేసుకునే సదుపాయం ఉంది.
ఇప్పటి వరకు వచ్చిన కాన్వాస్ సీరీస్ ఫోన్లకు ఇది భిన్నంగా ఉంది.ఫోన్ వెనక భాగం లెదర్ తో అలంకరణలా ఉంటుంది.
ఫోన్ విశేషాలు ఒక్కసారి పరిశీలిస్తే..
Display - 5.00 inch
Processor - 1.7GHz
Rear Camera - 13 megapixel
Front Camera - 5 megapixel
RAM - 2GB
Resolution - 720x1280 pixels
Storage - 8GB
OS - Android 4.4KitKat
Battery capacity - 2500mAh
Expandable storage - 32GB
USB - Micro-USB
Number of SIMs - 2
Colours - Pristine White, Blue
SIM 1
GSM/CDMA - GSM
3G - Yes
SIM 2
GSM/CDMA - GSM
3G - Yes

Read more ...

అసలేముంది ఆ సీడీల్లో !

 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలతో క్రైమ్ వాచ్ యాంకర్ హర్షవర్ధన్ ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో ఏలూరు సబ్ జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.
హర్షవర్ధన్ తో పాటు మరో నలుగురు కూడా ఇందులో నిందితులు.పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో ఉన్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్సాండెంట్‌ ఫాదర్‌ పి.బాలను హర్షవర్ధన్ బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేశారనేది ఆరోపణ.మా దగ్గర కొన్ని సీడీలు ఉన్నాయని అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వాటిని ప్రముఖ టీవీ చానల్లో ప్రసారం చేస్తాము అని బాలాను బెరించారు.అయితే ఇంతకి ఆ సీడీల్లో ఏముంది అనేది ప్రస్తుతానికి చర్చగా మారింది.అసలు నిజంగానే సీడీలు ఉన్నాయా లేకుంటే బెందిరించదానికే సీడీల నాటకం ఆడారా అనేదాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పట్టుబడిన నలుగురిలో ఒకరు ప్రభుత్వ అధికారుల దగ్గరకు అమ్మాయిలను పంపి వారు ఏకాంతంగా ఉన్నప్పుడు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలు ఉండడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కోట్లాది రూపాయలు విలువ చేసేంత సమాచారం ఆ సీడీల్లో ఉంటె కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చేది కాదని మరికొందరి వాదన.ఇన్నిరోజులుగా వీరి బారిన పడిన మరికొంత మంది కూడా డబ్బులు ఇచ్చారనే  సమాచారం పోలీసులకు అందుతుంది.ఇవే కాకుండా ఇంకేమైనా నేరాలకు వీరి గ్యాంగ్ పాల్పడిందా,వీరికి ఎవరెవరు సహకరించారు అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఆన్ని వివరాలు త్వరలోనే పోలీసుల విచారణలో బయటపడే అవకాశాలు ఉన్నాయి.
Read more ...

Monday, 8 September 2014

నేడు కాళోజి శతజయంతి సందర్భంగా వరంగల్ లో సిఎం కేసీఆర్ కాళోజి విగ్రహావిష్కరణ

 ప్రజాకవి కాళోజి నారాయణ రావు శతజయంతి సందర్భంగా హన్మకొండ లోని బాలసముద్రంలో రెండెకరాల స్థలంలో కాళోజి కళా కేంద్రానికి తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.వరంగల్ నిట్ కు కెసిఆర్ హెలికాప్టర్ లో చేరుకొని అక్కడినుండి నుండి బాలసముద్రానికి చేరుకొని భూమి పూజ చేస్తారు.సుమారు 2000 మంది కూర్చొవడానికి వీలుగా కళాక్షేత్రం ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యానవనం ఏర్పాటు చేస్తారు.హైదరాబాద్ లోని రవీంద్ర భారతికి ఏమాత్రం తీసిపోకుండా ఈ కళాక్షేత్రం ఉండాలని కెసిఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.ఆడిటోరియం ముందుభాగంలో కాళోజి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.
జిల్లాలోని సమస్యలు,ప్రభుత్వం చేపట్టాల్సిన పనులగురించి కెసిఆర్ తన వరంగల్ పర్యటనలో జిల్లా ప్రతినిధులు,అధికారులతో చర్చిస్తారు.తిరిగి సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ చేరుకొని సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే కాళోజి శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
Read more ...

రేపు గ్రూప్ పరీక్షలపై అవగాహనా సదస్సు


బుధవారం గ్రూప్ పరీక్షలపై అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణా ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.సాయంత్రం 5 గంటలకు బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసి కళాభవన్ లో ఈ సదస్సు జరుగుతుంది.హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి,ఆర్టీసీ ఎండి పుర్ణచందర్ రావు,ఇంటలిజన్స్ డీఐజీ మధుసూదన్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణ రావు సదస్సులో పాల్గొంటారు.ఎంట్రి ఫీజు లేదు.వివరాలకు 0949075535 నెంబర్ ను అభ్యర్ధులు సంప్రదించాలి.
Read more ...

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి సరికొత్త డెబిట్ కార్డు


బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్ బీఐ) మరో డెబిట్ కార్డ్ ను జారీ చేయడానికి సిద్ధమవుతున్నది.పిన్ నెంబర్ కలిగిన డెబిట్ కార్డులు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. పిన్ నెంబర్ లేకుండానే రూ.2 వేల లోపు లావాదేవీలు జరిపేందుకు ఎస్బీఐ ప్రత్యేక డెబిట్ కార్డ్ ను అందించాలనుకుంటున్నట్లు SBI డిప్యూటి ఎండీ ఎస్ కే మిశ్రా తెలిపారు.ఈ కార్డ్ జారి చేసేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతిని తిసుకోవాలనుకుంటున్నది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రతి డెబిట్ కార్డ్ కు ఒక పిన్ నంబర్ ఉంటుంది..కానీ ఈ పిన్ నంబర్ నుంచి తక్కువ స్థాయిలో జరిపే లావాదేవీలు ఉదాహరణకు బస్సు,మెట్రో టికెట్ ను కొనుగోలు చేసేవారిని మినహాయించాలనుకుంటున్నట్లు మల్టీ-కరెన్సీ ఫారెన్ ట్రావెలింగ్ కార్డ్ లాంచింగ్ కార్యక్రమంలో ఎస్ కే మిశ్రా తెలిపారు.
కొత్త మార్గదర్శకాలు వస్తే భవిష్యత్తులో విడుదలకానున్న అన్ని డెబిట్ కార్డులు పిన్ నంబర్ లేకుండానే వచ్చే అవకాశం ఉందని తెలిపారు.బ్యాంక్ ఈ ప్రత్యేక డెబిట్ కార్డులను జారి చేసే క్రమంలో ఇప్పటికే చెన్నై,ముంబై మెట్రో స్టేషన్లలో టెస్ట్-రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ మాస్టర్ కార్డ్ ను విదేశాలకు వెళ్లేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జారీ చేశారు.ఈ కార్డ్ ద్వారా డాలర్, ఫౌండ్లు,యూరో,సింగపూర్ డాలర్లుగా మార్చుకోవచ్చును.
ఈ కార్డ్ ను కొనుగోలు చేయాలంటే రూ.100 ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది.కానీ ఖచ్చితంగా 200 డాలర్ల మేర లోడ్ చేసుకోవాలి.
ఈ కార్డ్ ఢిల్లీ,ముంబై,చెన్నై,బెంగళూర్ లో ఉన్న 100 శాఖల్లో మాత్రమే లభ్యమవుతుందని మిశ్రా చెప్పారు.
Read more ...

అబుదాబిలో 13న భారత రాష్ట్రాల సదస్సు

ఈ నెల 13న భారత రాష్ట్రాల ప్రతినిధులతో అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని భారత రాయబార కార్యాలయం,ప్రవాస బారతీయ వ్యవహార మంత్రిత్వశాఖల సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు.
ఇందులో గోవా,పంజాబ్ రాష్టాల మంత్రులు మరియు వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.ఈ సదస్సుకు తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రులు కేసిఆర్,చంద్రబాబులకు ఆయా రాష్ట్రాల అధికారులతో పాటు మంత్రులను కూడా పంపాలని ఆదివారం వారికీ వినతి పత్రాలు సమర్పించినట్లు వలసదారుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంద భీంరెడ్డి మీడియాకు తెలిపారు.
యూఏఈ లో 17.5 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఇందులో 1.7 లక్షల మంది ఉన్నట్లు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం తెలుస్తుంది.
ఈ సదస్సులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అలాగే వలస కార్మికుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రవాసి భారతీయ సంఘాల పాత్రపై చర్చించనున్నారు.
Read more ...

Samantha Latest Photoshoot for JFW

Samantha Latest Photoshoot for JFW










Read more ...
Designed By Published.. Blogger Templates