కటక్ లో భారత్,శ్రీలంకల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ ఓడి మొదట
బ్యాటింగ్ చేసింది భారత్.
భారత్ ఓపెనర్లు శతకాలు సాధించడంతో 363 పరుగులు సాధించింది.364 పరుగుల భారీ
లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది.
మొదట్లో ఓపెనర్లు ధావన్,రహనే లు ఆచి తూచి ఆడుతూ నెమ్మదిగా స్కోరు బోర్డును
పరుగెత్తించారు.వీరుద్దరూ మొదటి వికెట్ కు 231 పరుగుల భాగస్వామ్యాన్ని
నెలకొల్పారు.ధావన్ 107 బంతుల్లో 14 ఫోర్లు,3 సిక్సుల సహాయంతో 113 చేసి
మొదటి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.కొద్దిసేపటికే రహనే(111,108 బంతుల్లో
13*4,2*6)కూడా 247 పరుగుల వద్ద ఔటయ్యాడు.తరువాత వచ్చిన రైనా కేవలం 33
బంతుల్లో 4 ఫోర్లు,3 సిక్సుల సహాయంతో 52 పరుగులు చేసి వెనుదిరిగాడు.చివర్లో
కోహ్లి 22,రాయుడు 27,అక్షర్ పటేల్ 14*,సాహ 10* రాణించడంతో 363 పరుగులు
సాధించారు.
భారబతి స్టేడియంలో ఇదే అత్యధిక స్కోర్.
భారబతి స్టేడియంలో ఇదే అత్యధిక స్కోర్.
No comments:
Post a Comment