కటక్ లో ఇండియా,శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో 169 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది శ్రీలంక.టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 363 పరుగులు చేసింది.364 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 39.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ విజయంతో సీరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది భారత్.రహనేకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో మ్యాచ్ నవంబర్ 6న అహ్మదాబాద్ లో జరగనుంది.
భారత్ విధించిన 364 లక్ష్య చేదనకు బరిలోకి దిగిన శ్రీలంక ఏదశలోనూ విజయం వైపు సాగలేదు.జయవర్థనే 43 పరుగులు మినహా ఒక్కరు కూడా రాణించలేదు.ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు,అక్షర్ పటేల్,ఉమేష్ యాదవ్ చెరో రెండు వికెట్లు,రైనా,అశ్విన్ లకు తలా వికెట్ దక్కింది.
No comments:
Post a Comment