రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి రూ.241 కోట్లు రావాల్సి ఉందని అసెంబ్లీ వ్యవహారాలు, బారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హరీష్ రావు సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ...ప్రభుత్వం తెలంగాణలో దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈమేరకు టీటీడీ నుంచి నిధులు రప్పించడానికి చర్యలు తీసుకోవాలని సేఎం అధికారులను ఆదేశించిన విషయాన్నీ మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన దూపదీప నివేద్యం పతకం కోసం కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించమని వివరించారు.
దూపదీప నైవేద్యం పతకం తమ ప్రభుత్వ పథకం కాకున్నా బేషజాలకు పోకుండా దైవ కార్యక్రమాల నిర్వహణకు నిధులు ఇచ్చామని అన్నారు. నల్గొండ జిల్లాలోని సుమారు 200 దేవాలయాల పునరుద్ధరణకు రూ.25 కోట్లు అవసరం ఉందని వివరించారు.అలాగే రాష్ట్రంలో జీర్ణదశకు చేరుకున్న దేవాలయాలను పునరుద్ధరించాల్సి ఉందని పేర్కొన్నారు.

No comments:
Post a Comment