Radio LIVE


Breaking News

Sunday, 23 November 2014

తెలంగాణా పీసీసీ వెబ్ సైట్ ప్రారంభం



తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక వెబ్ సైట్ ను రుపొందించుకుంది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఈమేరకు శనివారం ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు.తమ పార్టీకి సంబంధించిన వివరాలను ఈ వెబ్ సైట్ లో పొందుపరచినట్లు పొన్నాల వివరించారు.కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు, పార్టీ రాజ్యాంగం, మేనిఫెస్టో , అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, కార్యవర్గం వివరాలు శాసన సభ్యులు, మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యుల వివరాలను ఈ సైట్ లో పొందుపరచినట్లు పేర్కొన్నారు.కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ట్విట్టర్, ఫేస్ బుక్ లను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. పార్టీ సభ్యత్వం కావాలనుకుంటే వెబ్ సైట్ ద్వారానే మెంబర్ షిప్ ఇచ్చే ఏర్పాటు చేశామన్నారు.   

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates