సంగీత సాగరంలో నగరవాసులను ముంచెత్తేందుకు మరో మ్యూజిక్ ఫెస్టివల్
ముందుకొస్తుంది.మణికొండ లోని బౌల్దర్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ లో ఈ నెల
29, 30 తేదీల్లో నిర్వహించనున్న విండ్ సాంగ్-2014 ఫెస్టివల్ లో పలువురు
బాలివుడ్ సంగీత ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఇకో ఫ్రెండ్లీ సంగీత
ఉత్సవంలో ముంబైకి చెందిన లేస్లె లెవీస్ మరియు బాలీవుడ్ నటుడు, గాయకుడు
ఫర్హాన్ అక్తర్ ,ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు కు చెందిన పలు రాక్, ఫోక్
మ్యూజిక్ బ్యాండ్ లు పాల్గొననున్నాయి. పాప్ , రాక్, ఫంక్ , ఫోక్, రేగీ
సంగీత హోరులో ముంచెత్తేందుకు ఢిల్లీ కి చెందిన ఇండియన్ ఓషియన్ రాక్
బ్యాండ్, చెన్నై రాక్ బ్యాండ్ జంక్ యార్డ్, బెంగళూరు ఫోక్ బ్యాండ్ స్వరాత్మ
తదితర బృందాలు పాల్గొననున్నాయి.
No comments:
Post a Comment