ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు ఫిల్ హ్యూగ్స్ (25) దేశవాలీ మ్యాచులో
తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళాడు. బౌలర్ సియన్ ఎబ్బట్ విసిరిన బౌన్సర్ ను
హుక్ చేయబోగా బంతి హెల్మెట్ కు తగిలింది. కొద్ది క్షణాలు పిచ్ పై నిలబడ్డ
హ్యూగ్స్ ఆ తర్వాత కుప్పకూలిపోయాడు. ఆసుపత్రి వర్గాలు అతని పరిస్థితి
విషమంగా ఉన్నట్లు చెప్పాయి.ఇతన్ని రాబోయే భారత్ తో సీరీస్ లో గాయపడ్డ
మైఖేల్ క్లార్క్ స్థానంలో ఆడించాలనుకున్నారు.హ్యూగ్స్ ఆస్ట్రేలియా తరపున 26
టెస్ట్ లు, 25 వన్డేలు ఆడాడు.
No comments:
Post a Comment