ఈడెన్ లో దుమ్మురేపిన భారత్,శ్రీలంకపై మరో సునాయాస విజయం
శ్రీలంకతో జరుగుతున్న వన్డే సీరిస్ లో భారత్ కు ఎదురులేకుండా
పోతుంది.ఇప్పటికే సీరీస్ కైవసం చేసుకున్న భారత్ వరుసగా 4 వన్డేలలో గెలిచి
4-0 ఆధిక్యంలో నిలిచింది.గురువారం కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన
నాలుగో వన్డేలో భారత్ జట్టు శ్రీలంకపై 153 పరుగుల భారీ విజయాన్ని నమోదు
చేసుకుంది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో
404 పరుగులు చేసింది.405 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ
లక్ష చేదన దిశగా సాగలేదు.ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు ఖాతా
తెరవకుండానే మొదటి వికెట్ కోల్పోయింది.ఉమేష్ యాదవ్ కట్టుదిట్ట బౌలింగ్ కు
తోడు స్టువర్ట్ బిన్నీ కూడా అద్భుతంగా మొదట్లో బౌలింగ్ చేశాడు.వీరిద్దరూ
రెచ్చిపోవడంతో ఒక దశలో శ్రీలంక 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకలలోతు
కష్టాల్లో కూరుకుపోయింది.ఈ దశలో కెప్టెన్ మాథ్యుస్(75),తిరిమన్నే(59) లు
ఇద్దరూ 5వ వికెట్ కు 118 పరుగులు జోడించి విజయంపై ఆశ కలిగించినా వీరు ఔట్
అవడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది.పెరేరా(29) కొంచం సేపు వేగంగా ఆడినా ఫలితం
లేకపోయింది.చివరికి 43.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది శ్రీలంక.
ధవళ్ కులకర్ణి 4 వికెట్లు,ఉమేష్,బిన్నీ,అక్షర్ పటేల్ లు తలా రెండు
వికెట్లు తీసుకున్నారు.ఈ మ్యాచ్ ద్వారా వన్డేలకు అరంగేట్రం చేసిన కరణ్ శర్మ
9 ఓవర్లలో 64 పరుగులిచ్చాడు.
రోహిత్ శర్మకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
No comments:
Post a Comment