ఏపీ కి ప్రత్యేక హోదా లేనట్టేనా అంటే ఈరోజు కేంద్ర మంత్రి ఇంద్ర జిత్ చెప్పిన దాని ప్రకారం అది నిజమే అని అర్ధమౌతుంది.
ఈరోజు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, మాగంటి బాబు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.ఆయన ఇచ్చిన సమాధానం ప్రకారం ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని,ఏపీ,తెలంగాణా తోపాటు ఇతర రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయి,14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇచ్చిందే తప్ప ప్రత్యేక హోదా ఇవ్వలేదు,14వ ఆర్థిక సంఘంలో పలు మార్పులు జరిగాయని తన సమాధానంలో తెలిపారు మంత్రి ఇంద్రజిత్ సింగ్.
ఐతే పారిశ్రామిక ప్రోత్సాహకాలు కల్పిస్తాం,మొత్తం పెట్టుబడిలో 15 శాతానికి సమానమైన మొత్తానికి పన్ను మినహాయింపు ఇస్తాము,అదనపు పెట్టుబడి ప్రోత్సాహకం 2020 మార్చి 31 వరకు పొడిగిస్తాము,కొత్తగా ఏర్పాటు చేసుకునే యూనిట్లకు యంత్ర సామాగ్రి వర్తింపు రేటును 35 శాతం పెంచుతామని అన్నారు.
కేంద్రం మోసం చేసిందని,మాట తప్పిందని విపక్షాలు విరుచుకుపడ్డాయి.
No comments:
Post a Comment