నేపాల్ భూకంపంలో నేపధ్యంలో షూటింగ్ విరమించుకుని ‘ఎటకారం’ సినిమా యూనిట్ సభ్యులు తిరుగు ప్రయాణం అయ్యారు.
ఈ సందర్భంలోనే మరోసారి భూకంపం సంభవించడంతో ఎటకారం సినిమా నటుడు, నృత్య దర్శకుడు అయిన విజయ్(25) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
ప్రమాదానికి గురైన 10 నిముషాలకే విజయ్ మృతి చెందారు. ప్రస్తుతం విజయ్ మృతదేహం ఢిల్లీ కి చేరుకుంది.
బుధవారం మద్యాహ్నానికి విజయ్ మృతదేహం హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అంతరం మృతదేహాన్ని అక్కడి నుంచి విజయ్ స్వస్థలమైన గుంటూరు జిల్లా బాపట్లకు తరలించనున్నారు.
No comments:
Post a Comment