విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు విజయవాడ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ సంవత్సరం 62.13% ఉత్తీర్ణత కు గాను అమ్మాయిలు 67%,బాలురు 59% ఉత్తీర్ణత సాధించారు.మొత్తం 4,61,932 మంది విద్యార్థులు జనరల్ కేటగిరిలో హాజరు కాగా ఒకేషనల్ కి 26,913 మంది విద్యార్థులు హాజరయ్యారు.జనరల్ కేటగిరిలో 52 శాతం మందికి ‘ఏ’ గ్రేడ్ రాగా ఒకేషనల్ లో 60 శాతం మందికి ‘ఏ’ గ్రేడ్ లభించింది.
ఐతే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 4 శాతం ఉత్తీర్ణత పెరిగింది.ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో నిలవగా కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది.మే 25 నుండి జూన్ 2 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు.
No comments:
Post a Comment