ఏపీ లోని కర్నూల్ జిల్లా రుద్రవరం పోలీసు స్టేషన్ లో సినీనటి నీతూఅగర్వాల్ పై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదైంది.నీతూ అగర్వాల్ తో ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీ ప్రేమ ప్రయాణం అనే చిత్రాన్ని నిర్మించాడు.
పోలీసులు నీతూపై ఎర్రచందనం చెట్లు నరకడం, కొనుగోలు, స్మగ్లర్ల తో ములాఖత్, అక్రమ రవాణా వంటి తదితర అభియోగాల కింద కేసు నమోదు చేశారు.
మస్తాన్ వలీతో పాటు పలువురు ఎర్రచందనం స్మగ్లర్లకు ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి నిధులు బదిలీ అయినట్లు గుర్తించిన పోలీసులు ఆమె అరెస్టుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
దీంతో నీతూ కోసం ముంబై, బెంగళూరులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
No comments:
Post a Comment