ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ తుఫాను పేర్ల జాబితా నుంచి isis ను తొలగించింది.
isis అనేది ఈజిప్టు దేశస్తులు కొలిచే ప్రాచీన దేవత.
ప్రపంచ వాతావరణ సంస్థ అధికార ప్రతినిధి క్లేర్ నుల్లిస్ 2016 లో తూర్పు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే హరికేన్ల పేర్ల జాబితాలో ఈ దేవత పేరు చేర్చినట్లు చెప్పారు.
మరోవైపు ఇరాక్, సిరియాలో ఇదే పేరున ఉన్న ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్టు గ్రూప్ ఐసిస్ (isis) మారణహోమం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
అందుచేత కోస్టారికాలో జరిగిన ప్రపంచ వాతావరణ సంస్థ హరికేన్ కమిటీ సమావేశంలో isis అనే పేరును తుఫాన్ పేర్ల జాబితా నుంచి తొలగించి దీని స్థానంలో ivette అనే పేరును ఆ జాబితాలో చేర్చారు.
No comments:
Post a Comment