ద్రవ ఇంధనం శాటిలైట్ లో నింపేందుకు కొత్త కంట్రోల్ సిస్టంను ECIL తయారు చేసింది.
ఈ సిస్టం యంత్రాన్ని పూర్తిగా స్వదేశి పరిజ్ఞానంతో తయారు చేసినట్లు ఈసీఐఎల్ పేర్కోంది.
ECIL ఈ కొత్త యంత్రాన్ని మంగళవారం షార్ డైరెక్టర్ ప్రసాద్ కు అప్పగించింది. ఈ సందర్భంగా వారు ఇకపై శాటిలైట్ ప్రయోగాల్లో పూర్తిగా స్వదేశి పరిజ్ఞానంనే వినియోగించాలని నిర్ణయించుకున్నారు.
7 శాటిలైట్లను 2016 నాటికి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నామని ప్రసాద్ అన్నారు. వీటిలో భాగంగా జూన్ లో 3 యూకే కి చెందిన శాటిలైట్లను, జులై నాటికి 4 PSLV , ఒక GSLV లను ప్రయోగించనున్నట్లు ప్రసాద్ తెలిపారు.
రూ.700 కోట్ల షార్ బడ్జెట్ లో విదేశాలకే రూ.100 కోట్లు చెల్లిస్తున్నామని ఈ చెల్లింపులను క్రమంగా తగ్గిస్తామని ఆయన వెల్లడించారు.
No comments:
Post a Comment