రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సముద్రంలో మునిగిపోయిన అమెరికా విమాన వాహక నౌకను కాలిఫోర్నియా లోని ఫాలెన్ ద్వీపం సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించారు.
64 ఏండ్ల క్రితం యూఎస్ఎస్ ఇండిపెండెన్స్ విమాన వాహకనౌక మునిగిపోయింది.
నవంబర్ 1943 నుంచి ఆగస్టు 1945 వరకు ఇది సేవలనందించింది.
నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) పరిశోధకుడు జేమ్స్ డెల్గాడో ఈ నౌక గురించి మాట్లాడుతూ.. ఇది సముద్రంలో 2,600 అడుగుల (800 మీటర్లు) లోతులో ఉందని, చెక్కుచెదరకుండా నిటారుగా అలాగే నిలబడి ఉందని, అమెరికా అణుబాంబు పరిక్ష కోసం నిర్మించిన 90 నౌకల్లో ఇదీ ఒకటని ఆయన వెల్లడించారు.
No comments:
Post a Comment