పాకిస్థాన్ దేశం చైనా నుంచి 110 అత్యాధునిక JF-17 థండర్ ఫైటర్ జెట్ విమానాలను పొందనున్నది.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వచ్చేవారం పాకిస్థాన్ పర్యాటన సందర్భంగా ఇరుదేశాల మధ్య జరిగే ఆర్ధిక, రక్షణ సహకారంపై జరిగే ఒప్పందంలో భాగంగా చైనా పాకిస్థాన్ కు జెట్ విమానాలను అందించనున్నదని రేడియో పాకిస్థాన్ తెలిపింది.
చైనా ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ అధినేత చైనా దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా 110 జెట్ విమానాలను చైనా నుంచి పాకిస్థాన్ కు అందించనున్నట్లు వెల్లడించారు.
దీనిలో 50 జెట్ విమానాలను తొలివిడత మూడేండ్ల కాలంలో ఇవ్వనున్నట్లు సమాచారం.అయితే మిగిలిన 60 జెట్ విమానాలను ఎప్పటిలోగా అందిస్తారనే విషయంపై చైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
No comments:
Post a Comment