Radio LIVE


Breaking News

Sunday, 31 August 2014

ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూత

ప్రముఖ రచయిత,దర్శకుడు,చిత్రకారుడు బాపు గుండెపోటుతో చెన్నై లో కన్నుమూశారు.బాపు వయసు 80 ఏళ్ళు.చెన్నైలోని మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు బాపు.బాపూ అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీ నారాయణ.1933 డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు.ఆంధ్రపత్రికలో ఆయన కార్టూనిస్తుగా కెరీర్ ప్రారంభించిన ఆయన సంగీతకారుడిగా, చిత్రకారుడిగా, కార్టునిస్ట్ గా, డిజైనర్ గా పలు రంగాల్లో ఆయన సేవలు మరవలేనివి.
బాపు మొదటి సినిమా సాక్షి,చివరి సినిమా శ్రీ రామరాజ్యం.బాపూ తన కెరీర్ లో మొత్తం 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు.రెండు జాతీయ పురస్కారాలు,5 నంది అవార్డులు,ఉత్తమ దర్శకుడిగా రెండు ఫిలిం ఫేర్ అవార్డులు బాపూ గారి సొంతం.2012 సంవత్సరానికి గాను లైఫ్ టైం అచీవ్ మెంట్(ఫిలిం ఫేర్-సౌత్)అవార్డును బాపూ గారు గెలుచుకున్నారు.
ముత్యాలముగ్గు,మిస్టర్ పెళ్లాం చిత్రాలకు జాతీయ పురస్కారం..బాలరాజుకథ, అందాల రాముడు, ముత్యాలముగ్గు, పెళ్లిపుస్తకం, శ్రీరామరాజ్యం చిత్రాలకు నంది అవార్డు..సీతా కల్యాణం,వంశ వృక్షం చిత్రాలకు ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు బాపూ.
1986 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న బాపూ,2013 సంవత్సరంలో పద్మశ్రీ తో ప్రభుత్వం సత్కరించింది.
బాపు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు.హిందీలో కూడా చిత్రాలు చేసిన బాపూ మొదటి హిందీ సినిమా ప్రేమ్ ప్రతిజ్ఞ 1989 లో వచ్చింది.హమ్ పాంచ్, సీతా స్వయవర్, అనోఖా భక్త్, బేజుబాన్, వో సాత్ దిన్, ప్యారీ బహ్నా, మొహబ్బత్, మేరా ధరమ్ మొదలగు హిందీ చిత్రాలకు బాపూ దర్శకత్వం వహించారు.
బాపూ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.బాపు లేని లోటు తీర్చలేనిది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Read more ...

Saturday, 30 August 2014

ఇంగ్లాండ్ పై భారత్ సునాయాస విజయం

వన్డే ప్రపంచ ఛాంపియన్స్ భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై సునాయాస విజయం సాధించింది.శనివారం జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసింది.మొదట వికెట్ కు కుక్,హేల్స్ కలిసి 82 పరుగులు జత చేశారు.తరువాత వచ్చిన ఆటగాలు పరుగులు రాబట్టడడంలో విఫలం అవడం,తక్కువ పరుగులకే ఒకరి వెంట ఒకరు ఔట్ అవడంతో 227 పరుగులకే ఆలౌట్ అయింది.చివర్లో ట్రేడ్ వెల్ వేగంగా 30 పరుగులు చేయడంతో 200 పరుగులు స్కోర్ దాటింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ధావన్(16) వికెట్ ను త్వరగానే కోల్పోయినా తరువాత రహనే(45),కోహ్లి(40)కలిసి 50 పరుగులు జోడించారు.నాలుగో వికెట్ కు రాయుడు,రైనా కలిసి 87 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చారు.రోహిత్ శర్మ గాయంతో వైదొలగడంతో ఈ మ్యాచ్ లో అవకాశం దక్కించుకున్న రాయుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.64 పరుగులు చేసిన రాయుడు ఒక వికెట్ కూడా దక్కించుకున్నాడు.జట్టు స్కోర్ 207 పరుగులవద్ద రైనా(42)అవుట్ అయినా జడేజా(19*)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు రాయుడు.మూడు వికెట్లు తీసుకున్న అశ్విన్ కి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ విజయంతో 5 మ్యాచ్ ల సీరీస్ లో 2-0 తో ముందుంది భారత్.


Read more ...

సెప్టెంబర్ 19న ఆగడు విడుదల

ప్రిన్స్ మహేష్ బాబు,శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఆగడు'.శనివారం సాయంత్రం శిల్పకళావేదిక వేదికలో చిత్ర ఆడియో ఫంక్షన్ అంగరంగవైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆగడు చిత్రాన్ని సెప్టెంబర్ 19 విడుదల చేస్తున్నట్టు హీరో మహేష్ బాబు చివర్లో ప్రకటించారు.శంకర్ సినిమా విడుదల అవుతుంది అంటే మొదటి రోజే బ్లాక్ లో టికెట్ కొనుక్కొని వెళ్ళే వాడిని అని ఈ రోజు ఆగడు సినిమా ఆడియో ఫంక్షన్ కు రావడం ఆనందంగా ఉంది అని మహేష్ అన్నారు.తమన్ నాతొ నాలుగు సినిమాలు తీశాడు,శ్రీనువైట్ల దూకుడు నాకు టర్నింగ్ పాయింట్,ఇప్పుడు ఆగడు మరో టర్నింగ్ పాయింట్.దూకుడు అవగానే మన తదుపరి సినిమా ఆగడు అని శ్రీనువైట్ల తనతో చెప్పారని మహేష్ చెప్పుకొచ్చారు.
మహేష్ ఇప్పటికే దూకుడు,ఆగడు సినిమాలు తీశాడు.ఇక తరువాత మిగిలింది 'అందగాడు'.దూకుడు,ఆగడు,అందగాడు..ఇలా టైటిల్స్ పెట్టడమే మహేష్ కి యాప్ట్ అంటూ విజయనిర్మల అన్నారు.
నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ 'ఆగడు' అనే టైటిల్ చాలా బాగుంది.ట్రైలర్ ఇంకా బాగుంది.పాటలకంటే డైలాగులు అదిరిపోయాయని,'వాట్ టు డు వాట్ నాట్ టు డు'అనే డైలాగ్ నాకు ఫేవరేట్ డైలాగ్ అని అన్నారు.
ఇంకా ముఖ్య అతిథిగా వచ్చిన శంకర్ మాట్లాడుతూ,తమన్ నా దగ్గరకు వచ్చి నేను 50వ చిత్రానికి సంగీతం అందించిన చిత్రం ఆగడు,ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు రావాలని కోరారు,అలా కోరడంతో రాకుండా ఉండలేక పోయాను అని శంకర్ అన్నారు.బాయ్స్ సినిమాలో ఉన్న నలుగురిలో ఒక్కరు తమన్ కూడా,ఇప్పుడు మంచి సంగీత దర్శకుడిగా పరిచయం అవడం సంతోషంగా ఉంది అని శంకర్ అన్నారు.ఒక్కడు సినిమా నుండి మహేష్ సినిమాలు చూస్తున్నాను అని మంచి స్క్రీన్ ప్రజేన్స్ ఉన్న నటుడు మహేష్,ఆయన్ను అలా తెరమీద చూస్తుంటే ఆనందంగా ఉంటుంది,దూకుడు నా ఫేవరేట్ సినిమా,మీలాగే నేను కూడా ఆగడు సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను,శ్రీనువైట్ల మంచి కమర్షియల్ దర్శకుడు అని శంకర్ అన్నారు.




Read more ...

రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్-2 టీజర్ విడుదల

భీమవరం టాకీస్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఐస్ క్రీమ్2'.తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి,నవీన,నందు,గాయత్రీ,సిద్దు,భూపాల్,జీవ తదితరులు నటిస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపు పూర్తి కావొచ్చింది.
ఈ సినిమా ట్రైలర్ తో పాటు ఒక సాంగ్ రిలీజ్ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది.ఈ సందర్భంగా నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ సినిమా ట్రైలర్,సాంగ్ చూశాక సినిమా ఏంటో అర్థమౌతుంది,వర్మ అద్భుతాలు సృష్టించే వ్యక్తి ఆయనతో వరుస సినిమాలు చేయడం నా అదృష్టం,వర్మ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఈ ఏడాది నాతో సినిమా తీయడం ఆనందంగా ఉంది,ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు,ముగ్గురు హీరోలు నటిస్తున్నారు,సెప్టెంబర్ లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అని అన్నారు.
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ సాంగ్ చూసి షాక్ అయ్యాను,సాంగ్ ఎలా తీయాలో వర్మ గారికి బాగా తెలుసు,సాంగ్ చాలా అధ్బుతం ఉంది,చాలా కొత్తగా ఉంది చూస్తున్న ప్రతీ ఆడియన్ కూడా అలానే ఫీల్ అవుతారు అని అన్నారు...




Read more ...

ఆగడు ఆడియో ఫంక్షన్ LIVE

మహేష్ బాబు తాజా చిత్రం  'ఆగడు' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళావేదిక లో జరుగుతుంది.


Read more ...

రజినీకాంత్ 'లింగా' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీక్షించండి...

40 సంవత్సరాల సినీప్రస్థానాన్ని ఇటీవలే పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ తదుపరి చిత్రం 'లింగా'.రాక్
ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను గణేష్ చతుర్థి నాడు విడుదల చేసింది రాక్ లైన్ ఎంటర్ టైనమెంట్స్ సంస్థ.ఈ మోషన్ పోస్టర్లో రజిని వయసు మాత్రం కనిపించదు,అంటే ఇంకా యువకుడిలానే కనిపిస్తాడు.సన్ గ్లాసెస్,జాకెట్ వేసుకొని,స్టైల్ గా నడుస్తూ ఉన్న రజిని వెనకాల ఒక గుడి కనిపిస్తుంది ఈ మోషన్ పోస్టర్లో.
ఈ చిత్రంలో జగపతిబాబు కూడా నటిస్తున్నాడు.డిసెంబర్ 12న చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
లైన్ ఎంటర్ టైనమెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కే ఎస్ రవికుమార్ దర్శకుడు.అనుష్క,సోనాక్షి సిన్హా కథానాయికలు.ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.
Read more ...

Friday, 29 August 2014

జపాన్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ

ప్రధానిగా మోడీ మొదటిసారి జపాన్ పర్యటనకు బయలుదేరాడు.నేటి నుండి ఐదు రోజులపాటు ప్రధాని మోడీ జపాన్ లో పర్యటించనున్నారు.రిలయన్స్ అధినేత ముకేష్ అంబాని,విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ లు కూడా ప్రధాని వెంట జపాన్ పర్యటనకు వెళ్ళారు.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ముఖ్య ఉద్దేశ్యంగా ప్రధాని పర్యటన కొనసాగనుంది.జపాన్ స్మార్ట్ సిటీ అయిన క్యోటో నగరానికి ముందుగా మోడీ చేరుకుంటారు.మోడీకి స్వాగతం పలికేందుకు జపాన్ ప్రధాని ప్రత్యేకంగా క్యోటోకు
చేరుకోనున్నారు.అక్కడ ఇద్దరు ప్రధానులు వ్యక్తిగతంగా కలుసుకొని విందులో పాల్గొన్న తరువాత మాత్రమే అధికార చర్చల్లో పాల్గొననున్నారు.
భారత్ లో 100 స్మార్ట్ సిటీలను నిర్మించే ఉద్దేశ్యంలో ఉన్న మోడీ ముందుగా జపాన్ రాజధాని టోక్యో కాకుండా క్యోటో నగరానికి వెళ్లి పరిశీలించనున్నారు.
రెండు దేశాల మధ్యరక్షణ,అణుశక్తి,మౌలికసదుపాయాల అభివృద్ధి మొదలగు పలు అంశాల మీద ప్రత్యేకంగా చర్చలు జరిగే అవకాశం ఉంది.
నాకు సన్నిహితుడైన జపాన్ ప్రధాని షింజో అబే ఆహ్వానం మేరకు జపాన్ వెళ్తున్నందుకు ఆసక్తిగా ఉంది అని మోడీ అన్నారు.ఈ మధ్యే మోడీ కూడా జపాన్ బాషలో ట్వీట్ కూడా చేశారు.నా పర్యటన ఫలితాన్ని ఇస్తుంది అని నాకు నమ్మకం ఉంది అని మోడీ ఈ సందర్భంగా తెలిపారు.
జపాన్ ప్రధాని షింజో ట్విట్టర్ లో కేవలం ముగ్గురినే ఫాలో అవుతారు.వారిలో ఒకరు తన భార్య కాగా,ఇంకొకరు ఆ దేశ రాజకీయ నాయకుడు,మూడో వ్యక్తి భారత ప్రధాని మోడీ కావడం విశేషం.
Read more ...

నేడు భారత్,ఇంగ్లాండ్ ల మధ్య మూడో వన్డే

5 వన్డేల సీరీస్ లో భాగంగా శనివారం భారత్,ఇంగ్లాండ్ ల మధ్య మూడో వన్డే ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరగనుంది.సీరీస్ లో మొదటి వన్డే వర్షం కారణంగా రద్దవగా,రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది.
బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్న భారత్ జట్టును విరాట్ కోహ్లి ఫామ్ కలవరపరుస్తుంది.దానికితోడు ఓపెనర్ రోహిత్
శర్మ గాయం కారణంగా సీరీస్ నుండి తప్పుకోవడం ఒకింత కలవరపరిచే అంశం అయినప్పటికీ మిగతా ఆటగాళ్ళు ఫామ్ లో ఉండడం భారత్ కు అనుకూలించే అంశం.రోహిత్ శర్మ స్థానంలో మురళీ విజయ్ ఆడనున్నాడు.మురళీ విజయ్ ఇంకా ఇంగ్లాండ్ కు చేరుకోకపోవడంతో రహనే ఓపెనర్ గా రాయుడు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
వన్డేల్లో అంతగా రాణించని కుక్ సేన బౌలింగ్ విభాగంలో ఉన్న బలహీనతలను అధిగమించి ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని చూస్తుంది.పిచ్ విషయానికి వస్తే మొదటి టెస్ట్ ఇక్కడే జరిగింది,బ్యాటింగ్ కు అనూకులించే అవకాశాలు ఎక్కువ.మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

For More News  Visit Radiojalsa
Read more ...

సైనా ఇంటికి,సింధు సెమీస్ కి

ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువసంచలనం పీవీ సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది.19 సంవత్సరాల సింధు 2013 ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.అయితే మరో షట్లర్ భారత నెంబర్ 1 క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు మాత్రం ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ అందని ద్రాక్షగానే ఊరిస్తుంది.గత బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పతకం సాధించకుండానే ఇంటిదారి పట్టింది.
11వ సీడెడ్ క్రీడాకారిణి సింధు ప్రపంచ నెంబర్ 2 క్రీడాకారిణి శిక్జియాన్ వ్యాంగ్ పై 19-21,21-19,21-15 తేడాతో విజయం సాధించి సెమీస్ లో అడుగుపెట్టింది.చైనా కు చెందిన శిక్జియాన్ వ్యాంగ్ తో ఇప్పటివరకు ఆరుసార్లు పోటీ పడగా నాలుగుసార్లు సింధునే విజయం సాధించింది.మరోవైపు 7వ సీడ్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్ లో వరల్డ్ నెంబర్ 1 క్రీడాకారిణి లీ చేతిలో 21-15 21-15 తేడాతో ఓడి ఇంటి బాట పట్టింది.
సింధు సెమీఫైనల్లో కొరియాకు చెందిన 6వ సీడ్ 'యేఒన్ జూ బే' తో తలపడనుంది.ఇప్పటివరకు రెండుసార్లు పోటీపడగా రెండింటిలో ఓటమి చవిచూసింది సింధు.
గుత్తా జ్వాల,పొంనప్ప ల జంట 16-21,8-21 తేడాతో చైనా జంట మీద ఓడి టోర్నీ నుండి నిష్క్రమించారు.
Read more ...

దేశంలో 4 కోట్ల అశ్లీల వెబ్ సైట్లు ఉన్నాయి!

అశ్లీల వెబ్ సైట్లను నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని అది తమవల్ల కాదని ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో తెలిపింది.ఇండియాలో దాదాపుగా 4 కోట్ల అశ్లీల వెబ్ సైట్లు ఉన్నాయి,ఒక సైట్ ను బ్లాక్ చేస్తే కొత్తగా మరొకటి పుట్టుకొస్తుంది అని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.చైల్డ్ పోర్నోగ్రఫీ మీద నిషేధం విధించాలని,పెద్దలకు సంబందించిన అశ్లీల వెబ్ సైట్ లను బ్లాక్ చేయాలని కోరుతూ గత సంవత్సరం దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం శుక్రవారం కోర్టులో విచారణకు రాగా ప్రభుత్వం తన వాదనను కోర్టుకు వినిపించింది.
బూతు సైట్లకు సంభందించిన సర్వర్లు అన్నీ బయటి దేశాల్లో ఉండడంవల్ల వాటి మీద నియంత్రణ కష్టమవుతుంది,ఈ సమస్య పరిష్కారానికి ఒక కమిటీ నియమించడం జరిగింది అంది కేంద్రం తెలిపింది.తదుపరి విచారణలో కమిటీ పురోగతి కోర్టుకు తెలియజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది(తదుపరి విచారణ 6 వారాల తరువాత జరగనుంది).చట్టం,సాంకేతిక పరిజ్ఞానం,పాలన మొదలగు వాటిని ఉపయోగించి ఇంటర్నెట్ లో అశ్లీలతను తగ్గించే ప్రయత్నం చేయాలని కోర్టు సూచించింది.
మహిళల మీద అత్యాచారాలకు ఈ అశ్లీల చిత్రాలే ఆద్యం పోస్తున్నాయని పిటీషనర్ తన పిటీషన్ లో పేర్కొన్నారు.ఢిల్లీలో 2012 సంవత్సరంలో ఒక వైద్య విద్యార్థిని మీద కొందరు కామపిశాచులు అత్యాచారం చేసిన ఘటనను ఇందులో పేర్కొన్నారు పిటీషనర్,ఈ ఘటనకు ముందు ఆ దుర్మార్గులు వారి సెల్ ఫోన్ లో అశ్లీల దృశ్యాలు చూశారని పిటీషన్లో పేర్కొన్నారు.
కోర్టు మరియు ప్రభుత్వం అనుమతి లేకుండా అశ్లీల సైట్లను బ్లాక్ చేయడం ఆచరణ పరంగా మరియు సాంకేతికపరంగా అసాధ్యమని ఈ సంవత్సరం జనవరిలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సుప్రీంకోర్టుకు తెలిపారు.

For More News Visit Radiojalsa.com






Read more ...

Thursday, 28 August 2014

చనిపోయిన వ్యక్తి లేచి వచ్చిన వేళ

54 సంవత్సరాల బ్రెజిల్ దేశానికి చెందిన వ్యక్తి కాన్సర్ తో చనిపోయాడని నిర్దారించి ప్లాస్టిక్ సంచిలో పెట్టిన రెండు గంటల తరువాత మళ్ళీ బ్రతికిన ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే :
గొంకాల్వేస్ అనే బ్రెజిల్ దేశస్థుడు గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతూ మెనాన్డ్రో డి ఫారియాస్ ఆసుపత్రిలో చేరాడు.అప్పటికే కాన్సర్ అడ్వాన్సు స్టేజిలో ఉందని,రెండు సార్లు హార్ట్ ఎటాక్ ఆసుపత్రిలో ఉన్నప్పుడే వచ్చిందని ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చనిపోయాడు అని డాక్టర్లు నిర్దారించారు అని బంధువులు తెలిపారు. 

గొంకాల్వేస్ చనిపోయాడు అని నిర్దారించుకున్నాక చెవు,ముక్కు రంధ్రాలను కాటన్ తో మూసివేశారు. తరువాత బాడీని ప్లాస్టిక్ కవర్లో పెట్టి జిప్ పెట్టి మార్చురీకి తరలించారు.తరువాత అతని అంత్యక్రియల నిమిత్తం గొంకాల్వేస్ సోదరుడు బాడీ దగ్గరకు వెళ్లి డ్రెస్ మర్చేక్రమంలో ప్లాస్టిక్ కవర్ కదలడం గమనించాడు.వెంటనే డాక్టర్లను పిలవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలోకి తీసుకెళ్ళారు గొంకాల్వేస్ ను.అయితే అతనిని ప్లాస్టిక్ బాగ్ లో పెట్టి అప్పటికే రెండు గంటలు అయింది.

Read More




Read more ...

Wednesday, 27 August 2014

ఇంగ్లాండ్ పై భారత్ ఘనవిజయం

టెస్ట్ సీరీస్ లో ఘోర పరాభవం తరువాత ఇంగ్లాండ్ తో మొదలైన వన్డే సీరీస్ లో మొదటి మ్యాచ్ రద్దు అవగా,బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 133 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది.ఈ విజయంతో సీరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
        305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్,భారత్ బౌలర్ల ధాటికి 161 పరుగులకే ఆలౌట్ అయింది.హేల్స్ ఒక్కడే 40 పరుగులతో రాణించాడు.
India won  రవీందర్ జడేజా 4 వికెట్లతో రాణించాడు.ఇంగ్లాండ్ బౌలర్లను చితగ్గొట్టి 100 పరుగులతో పాటు,1 వికెట్    దక్కించుకున్న రైనాకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.   
        అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  304 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్ శిఖర్ ధావన్ 11 పరుగులకే వోక్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.తరువాత బ్యాటింగ్ కు దిగిన కోహ్లి అదే ఓవర్లో  డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.వార్మప్ మ్యాచ్ లో రాణించినా ఈ మ్యాచ్ లో మాత్రం సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు.19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ తరువాత వచ్చిన రహనే తో కలిసి రోహిత్ స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు.మొదట నెమ్మదిగా ఆడిన వీరిద్దరూ తరువాత వేగంగా ఆడారు.రోహిత్ 52 పరుగులు,రహనే 41 పరుగులు చేసి వెనుదిరిగారు.తరువాత వచ్చిన రైనా ధాటిగా ఆడాడు.కేవలం 75 బంతుల్లో 100 పరుగులు చేశాడు.రైనా వచ్చిన తరువాత స్కోర్ బోర్డు పరుగులు తీసింది.కెప్టెన్ ధోని(52)తో కలిసి రైనా 5వ వికెట్ కు 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.చివర్లో  అశ్విన్ 5 బంతుల్లో 10 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 300 దాటింది.

SCORECARD

India Innings - 304/6 (50 overs)

BATTINGOUT DESCRB4S6SSR
Rohit Sharmac C Woakes b J Tredwell52874159.8
Shikhar Dhawanc J Buttler b C Woakes11222050.0
Virat Kohlic Cook b C Woakes03000.0
Ajinkya Rahanest J Buttler b J Tredwell41474087.2
Suresh Rainac J Anderson b C Woakes10075123133.3
MS Dhoni (c & wk)b C Woakes525160102.0
Ravindra Jadejanot out9110081.8
Ravichandran Ashwinnot out10520200.0
Extras29(b - 1 w - 16, nb - 1, lb - 11)
Total304(50 Overs, 6 Wickets)
Did not bat:Bhuvneshwar Kumar, Mohammed Shami, Mohit Sharma
BOWLEROMRWNBWDER
James Anderson101570025.7
Chris Woakes101524025.2
Chris Jordan1007300127.3
Ben Stokes70540107.7
Joe Root30140004.7
James Tredwell101422004.2           

England Innings - 161

BATTINGOUT DESCRB4S6SSR
Alastair Cook (c)lbw b Shami19332057.6
Alex Halesc Ashwin b R Jadeja40635063.5
Ian Bellb Shami120050.0
Joe Rootb Bhuvneshwar4410100.0
Eoin Morganc Shami b Ashwin28453062.2
Jos Buttler (wk)c Kohli b R Jadeja290022.2
Ben Stokesc A Rahane b R Jadeja23293079.3
Chris Woakesst Dhoni b R Jadeja20230187.0
Chris Jordanlbw b Raina02000.0
James Tredwellc R Jadeja b Ashwin10110190.9
James Andersonnot out9810112.5
Extras5(b - 0 w - 2, nb - 0, lb - 3)
Total161(38.1 Overs, 10 Wickets)
BOWLEROMRWNBWDER
Bhuvneshwar Kumar70301004.3
Mohit Sharma61180003.0
Mohammed Shami60322025.3
Ravichandran Ashwin9.10382004.1
Ravindra Jadeja70284004.0
Suresh Raina30121004.0
FOWBATSMANSCOREOVER
1Alastair Cook54/110.3
2Ian Bell56/210.6
3Joe Root63/313.4
4Alex Hales81/420.4
5Jos Buttler85/522.4
6Eoin Morgan119/629.5
7Ben Stokes126/732.4
8Chris Jordan128/833.2
9Chris Woakes143/935.3
10James Tredwell161/1038.1
Read more ...

మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి

తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజీనామా చేసిన మెదక్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి పేరును పార్టీ ప్రకటించింది.కాంగ్రేస్ పార్టీ వీడి బీజేపీలో చేరిపోయారు జగ్గారెడ్డి.ఈ విషయాన్నీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.నామినేషన్లకు చివరి రోజు ఈరోజే కావడంతో మరికొద్ది సేపట్లో నామినేషన్ కూడా వేయనున్నాడు జగ్గారెడ్డి.పార్టీలో చేరడం,మెదక్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.
గతంలో బీజేపీలో పనిచేశానని.ఏబీవీపీ నుండి క్రియాశీల కార్యాకర్తగా ఉన్నానని జగ్గారెడ్డి తెలిపారు.
అయితే బీజేపీ నుండి అంజిరెడ్డి పేరు దాదాపు ఖరారు అయిందని అందరూ బావించినప్పటికి ఒక్కసారిగా జగ్గారెడ్డి తెరమీదకు రావడం జరిగింది.దీంతో మెదక్ బీజేపీ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమౌతుంది.
visit radiojalsa.com for more news updates.........



Read more ...

పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఇక 80 మార్కులకే

తెలంగాణా రాష్ట్రంలో 9,10వ తరగతి పరీక్షల సంస్కరణను ప్రభుత్వం చేపట్టింది.దీనికి సంబందించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది ప్రభుత్వం.ఈ సంస్కరణలు ఈ విద్యా సంవత్సరం నుండే అమలు కానున్నాయి.
ప్రస్తుతం ఉన్న తొమ్మిది పేపర్ల స్థానే ఇప్పుడు 11 పేపర్లు ప్రవేశపెట్టనున్నారు.అలాగే ప్రతీ సబ్జెక్టులో పరీక్ష 80 మార్కులకు నిర్వహించనున్నారు.అంటే మిగతా 20 మార్కులు ఇంటర్నల్స్(అంతర్గత మూల్యాంకనం-ఫార్మేటివ్ అసెస్మెంట్స్) కిందికి వస్తాయి.వీటిని ఉపాధ్యాయులే నిర్నహిస్తారు.అన్నీ కలిపి ప్రతీ సబ్జెక్టులో 35 మార్కులు వస్తే
విధ్యార్థులు పాస్ అవుతారు.అంతర్గత మూల్యాకనంలో సున్నా వచ్చినా రెండు పేపర్లు కలిపి 35 మార్కులు వస్తే సరిపోతుంది,ఇంకా అంతకు మించి ఎలాంటి నిభందనలు లేవు.
ఇక మీదట ప్రశ్నాపత్రాల రీవాల్యూయేషన్ ఉండదు.రీకౌంటింగ్,రీవెరిఫికేషన్ మాత్రమే ఉంటాయి.ఇక నుండి విద్యార్థులు ప్రైవేటుగా రాసుకోవడానికి కుదరదు.అలా రాసుకోవాలంటే ఓపెన్ స్కూల్ విధానంలో రాసుకోవాల్సి ఉంటుంది.
visit radiojalsa.com for more news updates
పరీక్ష నూతన విధానం-మార్కులు
Subject Paper-I Paper-II Internal Total
ఫస్ట్ లాంగ్వేజ్
(తెలుగు/హిందీ/ఉర్దూ)
40 40 20 100
సెకండ్ లాంగ్వేజ్
(తెలుగు/హిందీ)
80 00 20 100
థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్) 40 40 20 100
గణితం  40 40 20 100
సామాన్య శాస్త్రం 40
(భౌతికం)
40
(జీవశాస్త్రం)
20 100
సాంఘీక శాస్త్రం 40 40 20 100
మొత్తం 280 200 120 600
Read more ...
Designed By Published.. Blogger Templates