Radio LIVE


Breaking News

Tuesday, 26 August 2014

మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి

మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది.పలువురి పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు కొత్త ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.బుధవారం ఉదయం తొమ్మిది గంటల
తొమ్మిది నిమిషాలకు సంగారెడ్డిలో ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.
ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్,మైనంపల్లి హనుమంతరావు,ప్రవీణ్ రెడ్డి,భూపాల్ రెడ్డి తదితరుల పేర్లు పరిశీలనకు వచ్చిన చివరికి ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు.గత ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే సీటు ఆశించినా టికెట్ మాత్రం దొరకలేదు.
సెప్టెంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది.సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా,ఎంపీగా గెలిచిన సీఎం కెసిఆర్ మెదక్ ఎంపీ సీటుకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates