Radio LIVE


Breaking News

Saturday, 30 August 2014

సెప్టెంబర్ 19న ఆగడు విడుదల

ప్రిన్స్ మహేష్ బాబు,శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఆగడు'.శనివారం సాయంత్రం శిల్పకళావేదిక వేదికలో చిత్ర ఆడియో ఫంక్షన్ అంగరంగవైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆగడు చిత్రాన్ని సెప్టెంబర్ 19 విడుదల చేస్తున్నట్టు హీరో మహేష్ బాబు చివర్లో ప్రకటించారు.శంకర్ సినిమా విడుదల అవుతుంది అంటే మొదటి రోజే బ్లాక్ లో టికెట్ కొనుక్కొని వెళ్ళే వాడిని అని ఈ రోజు ఆగడు సినిమా ఆడియో ఫంక్షన్ కు రావడం ఆనందంగా ఉంది అని మహేష్ అన్నారు.తమన్ నాతొ నాలుగు సినిమాలు తీశాడు,శ్రీనువైట్ల దూకుడు నాకు టర్నింగ్ పాయింట్,ఇప్పుడు ఆగడు మరో టర్నింగ్ పాయింట్.దూకుడు అవగానే మన తదుపరి సినిమా ఆగడు అని శ్రీనువైట్ల తనతో చెప్పారని మహేష్ చెప్పుకొచ్చారు.
మహేష్ ఇప్పటికే దూకుడు,ఆగడు సినిమాలు తీశాడు.ఇక తరువాత మిగిలింది 'అందగాడు'.దూకుడు,ఆగడు,అందగాడు..ఇలా టైటిల్స్ పెట్టడమే మహేష్ కి యాప్ట్ అంటూ విజయనిర్మల అన్నారు.
నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ 'ఆగడు' అనే టైటిల్ చాలా బాగుంది.ట్రైలర్ ఇంకా బాగుంది.పాటలకంటే డైలాగులు అదిరిపోయాయని,'వాట్ టు డు వాట్ నాట్ టు డు'అనే డైలాగ్ నాకు ఫేవరేట్ డైలాగ్ అని అన్నారు.
ఇంకా ముఖ్య అతిథిగా వచ్చిన శంకర్ మాట్లాడుతూ,తమన్ నా దగ్గరకు వచ్చి నేను 50వ చిత్రానికి సంగీతం అందించిన చిత్రం ఆగడు,ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు రావాలని కోరారు,అలా కోరడంతో రాకుండా ఉండలేక పోయాను అని శంకర్ అన్నారు.బాయ్స్ సినిమాలో ఉన్న నలుగురిలో ఒక్కరు తమన్ కూడా,ఇప్పుడు మంచి సంగీత దర్శకుడిగా పరిచయం అవడం సంతోషంగా ఉంది అని శంకర్ అన్నారు.ఒక్కడు సినిమా నుండి మహేష్ సినిమాలు చూస్తున్నాను అని మంచి స్క్రీన్ ప్రజేన్స్ ఉన్న నటుడు మహేష్,ఆయన్ను అలా తెరమీద చూస్తుంటే ఆనందంగా ఉంటుంది,దూకుడు నా ఫేవరేట్ సినిమా,మీలాగే నేను కూడా ఆగడు సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను,శ్రీనువైట్ల మంచి కమర్షియల్ దర్శకుడు అని శంకర్ అన్నారు.




No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates